Liger: లైగర్ నుంచి మరో రొమాంటిక్ సాంగ్.. ఆకట్టుకుంటున్న అఫత్ పాట..

ఇందులో విజయ్ మరింత మాస్ లుక్ లో కనిపించాడు. తాజాగా రిలీజ్ అయిన అఫత్ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Liger: లైగర్ నుంచి మరో రొమాంటిక్ సాంగ్.. ఆకట్టుకుంటున్న అఫత్ పాట..
Liger
Follow us

|

Updated on: Aug 06, 2022 | 10:02 AM

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రధాన పాత్రలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లైగర్ (Liger) సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో రొమాంటిక్ సాంగ్ అఫత్ విడుదల చేశారు మేకర్స్. ఇందులో విజయ్ మరింత మాస్ లుక్ లో కనిపించాడు. తాజాగా రిలీజ్ అయిన అఫత్ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇందులో విజయ్, అనన్య మరింత రొమాంటిక్‏గా కనిపిస్తున్నారు. అలాగే లిరిక్స్ సైతం ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే విడుదలైన అక్డీ పక్డీ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అన్నికార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మాస్ డైరెక్టర్ జగన్నాథ్ కాంబోలో విజయ్, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జంటగా నటిస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఇందులో రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు.

వీడియో..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో