Sarkaru Vaari Paata : మహేష్ సినిమా ప్లేస్‌లో మెగాస్టార్ సినిమా.. సర్కారు వారి పాట సంగతేంటి మరి..?
సంక్రాంతి పెద్ద సినిమాలు సందడి చేస్తాయని అనుకుంటే.. కరోనా దెబ్బకు రిలీజ్ కు రెడీ అయినా సినిమాలన్నీ వెనకడుగేశాయి..
Sarkaru Vaari Paata : సంక్రాంతి పెద్ద సినిమాలు సందడి చేస్తాయని అనుకుంటే.. కరోనా దెబ్బకు రిలీజ్ కు రెడీ అయినా సినిమాలన్నీ వెనకడుగేశాయి.. గత ఏడాది అఖండ , పుష్ప లాంటి సినిమాలు విడుదలై సంచలన విజయాన్ని అందుకున్నాయి. ఆ ఊపులోనే సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలన్నీ విడుదలై టాలీవుడ్ కు పూర్వ వైభవాన్ని తీసుకువస్తామని అంతా భావించారు. కానీ అది జరగలేదు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్, ప్రభాస్ రాధేశ్యామ్, మెగాస్టార్ ఆచార్య, పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్, మహేష్ సర్కారు వారి పాట ఇలా భారీ సినిమాలన్నీ రిలీజ్ లను వాయిదా వేసుకున్నాయి. సంక్రాంతికి రావాల్సిన సినిమాలన్నీ ఇప్పుడు సమ్మర్ వైపు చూస్తున్నాయి. అన్నింటికన్నా ముందు మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా సమ్మర్ ను టార్గెట్ చేసింది. ముందుగా మహేష్ సినిమాను జనవరి 13న విడుదల చేయాలనుకున్నారు. అయితే అదే సమయంలో ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ ఉండటంతో మహేష్ తన సినిమాను ఏప్రిల్ 1కి వాయిదా వేసుకున్నారు. ఆతర్వాత మహేష్ బాబు మోకాలికి సర్జరీ అవ్వడంతో.. ఆవెంటనే మహేష్ తో పాటు కీర్తిసురేష్ , చిత్రయూనిట్ కరోనా బారిన పడటంతో షూటింగ్ కు బ్రేక్ వచ్చింది. ఇంతలో మహేష్ అన్న రమేష్ బాబు కన్నుమూయడంతో షూటింగ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు మహేష్ బాబు డేట్ ను మెగాస్టార్ పిక్ చేసుకున్నారు. అన్ని సినిమాలతోపాటు ఆచార్య సినిమా కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే. జనవరి రిలీజ్ అనుకున్నారు కానీ కరోనా విజృంభిస్తుండటంతో అది కుదరలేదు. ఇక ఇప్పుడు ఏప్రిల్ 1న సినిమాను రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. అదే రోజు మహేష్ బాబు ముందే కర్చీఫ్ వేసుకున్నాడు అయినా ఆచార్య టీమ్ ఈ డేట్ ను అనౌన్స్ చేయడంతో మహేష్ సినిమా మరోసారి వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తుంది. మరి మహేష్ బాబు సర్కారు వారి పాట దసరా వరకు విడుదల అవుతుందో లేదా ఆ తర్వాతే విడుదల అవుతుందో చూడాలి. దీనిపై సర్కారు వారి పాట చిత్రయూనిట్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
మరిన్ని ఇక్కడ చదవండి :