Bhama Kalapam: కామెడీ థ్రిల్లర్ వడ్డించేందుకు సిద్దమైన ప్రియమణి.. ఆకట్టుకుంటున్న భామ కలాపం గ్లింప్స్..
ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ అందిస్తుంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా.
ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ అందిస్తుంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా. సూపర్ హిట్ చిత్రాలు, సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్, టాక్ షోలతో దూసుకుపోతుంది. అంతేకాకుండా.. ఇతర భాషల్లోని సినిమాలను సైతం తెలుగులోకి డబ్ చేసి విడుదల చేస్తూ డిజిటల్ ప్లాట్ ఫాంలో నెంబర్ వన్ దిశగా దూసుకుపోతుంది ఆహా. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగిన ప్రియమణితో మరో విభిన్న ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన అభిమన్యు తాడిమేటి కథ, దర్శకత్వం వహించిన భామా కలాపం అనే వెబ్ సిరీస్ ఆహాలో రాబోతుంది. ఈ సిరీస్ అతి తర్వలోనే ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో టెలికాస్ట్ కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి విడుదలైన పోస్టర్ మరింత ఆసక్తిన కలిగించింది. తాజాగా ఈ సిరీస్ నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. యూట్యూబ్ లో వంటల రెసిపీలు చేసే ఒక మహిళ అనుకుని విధంగా.. తనకు రాని, తెలియని వంటను చేయాల్సి వస్తుంది.అప్పుడు తాను ఎదుర్కోన్న సమస్యలు ఏంటీ.. అసలు ఎందుకు ఆమె ఈ విధంగా చేయాల్సి వచ్చింది అనేది సస్పెన్స్ గా చూపించారు. అయితే ఇక్కడ ప్రియమణి భయంతో ఒక పెద్ద కత్తి పట్టుకొని టెన్షన్ గా భయంతో దేన్నో కట్ చేయడం చూపించారు. కానీ ఏంటనేది చూపించకుండా ఆసక్తిని రేకెత్తించారు. మొత్తానికి భామ కలాపం సిరీస్ ద్వారా ప్రియమణి ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకునేందుకు సిద్ధమైంది.
Also Read: Naga Chaitanya: ఆ విషయంలో నాకు సమంతే బెస్ట్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నాగచైతన్య..
Pushpa Srivalli Dance: శ్రీవల్లి పాటకు స్టెప్పులేసి టీమిండియా క్రికెటర్లు.. అదరగొట్టేశారుగా.!
Anasuya Bharadwaj: అనసూయ తమిళ్ మూవీ నయా పోస్టర్ చూశారా.. ఆకట్టుకుంటోన్న అందాల భామ..