Unstoppable With NBK: నా చేతిలో అయిపోయాడు.. ఖతం అంటూ బాలయ్య వార్నింగ్.. ఎవరికీ ?.. ఎందుకంటే ?..
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ టాక్ షో ద్వారా వ్యాఖ్యాతగానూ అదరగొడుతున్నారు బాలయ్య. తనదైన కామెడీ పంచులతో.. చమత్కారంతో సెలబ్రెటీలే కాదు.. ప్రేక్షకులు సైతం ఫిదా అవుతున్నారు. ఇప్పటికే ఈ షోకు ఎంతోమంది సినీ తారలు విచ్చేసి సందడి చేశారు. మెహన్ బాబు, రాజమౌళి, బ్రహ్మనందం, రవితేజ, రానా, అనిల్ రావిపూడి, గోపిచంద్ మలినేని వంటి ప్రముఖులు వచ్చి సందడి చేశారు. తాజాగా లైగర్ టీం… విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్, ఛార్మీ అన్‌స్టాపబుల్ షోలో రచ్చ చేశారు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.
ఈ సందర్భంగా ఆహా ఈ ఎపిసోడ్ నుంచి సరదా క్లిప్పింగ్ షేర్ చేసింది. అందులో బాలయ్య మాట్లాడుతూ.. టాక్ షో అనగానే మడి కట్టుకుని కూర్చుని.. నాలుగు ప్రశ్నలు అడిగి.. అవతలి వ్యక్తి తెలివిగా జవాబులు చెబితే అవి వినడం నా వల్ల కాదని చెప్పాను.. అందుకు ఒక షరతు కూడా పెట్టాను. వచ్చిన వాళ్లను ఆడుకుంటానని చెప్పాను అని అన్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండను సెట్ లో వేలాడదీసిన శాండ్ బ్యాగ్ ను తన్నమన్నారు. విజయ్ గట్టిగా దాన్ని తన్నడంతో అది తిరిగి వెనక్కు వచ్చింది. దీంతో బాలకృష్ణ నటించిన మొదటి చిత్రం ఏది ? అని ప్రశ్నించగా.. విజయ్ ఆలోచనలో పడ్డారు. షోకు వచ్చిన అభిమానుల్లో ఒకరు తాతమ్మ కల అని సమాధానం చెప్పగా.. వాడు నా చేతిలో అయిపోయాడు ఖతం అంటూ సరదాగా వార్నింగ్ ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Coronavirus: కరోనా బారిన పడిన ‘ఖిలాడీ’ బ్యూటీ.. రెండు డోసులు టీకా తీసుకున్నా వదలని వైరస్..
Ashok Galla’s HERO: హీరో చిత్రయూనిట్ థాంక్యూ మీట్.. మంచి టాక్ ను సొంతం చేసుకున్న అశోక్ గల్లా మూవీ..
Bangarraju: సినిమా చూసి ఇంటికి రాగానే అమల ఏడ్చేసింది.. ఆసక్తికర విషయం చెప్పిన నాగార్జున