Bangarraju: సినిమా చూసి ఇంటికి రాగానే అమల ఏడ్చేసింది.. ఆసక్తికర విషయం చెప్పిన నాగార్జున

అక్కినేని నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన సినిమా బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Bangarraju: సినిమా చూసి ఇంటికి రాగానే అమల ఏడ్చేసింది.. ఆసక్తికర విషయం చెప్పిన నాగార్జున
Nagarjuna
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 16, 2022 | 7:08 PM

Bangarraju: అక్కినేని నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన సినిమా బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో అందాల భామలు రమ్యకృష్ణ, కృతి శెట్టి నటించిన విషయం తెలిసిందే. ఇక బంగార్రాజు సినిమా సంక్రాంతి కానుకగా శుక్రవారం (జనవరి 14న ) థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు. నాగార్జున నిర్మాతగా కూడా వ్యవహరించారు. కాగా, విడుద‌లైన మొద‌టిరోజునే సంక్రాంతి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా న‌మోదు చేసుకుంది. ఈ సందర్భముగా హీరో నాగార్జున మాట్లాడుతూ.. సంక్రాంతికి బంగార్రాజు సినిమాను బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చేసిన ప్రేక్ష‌కుల‌కు పాదాబివంద‌నం తెలియజేస్తున్నా అన్నారు. ఈ సినిమా మైసూర్ ప్రాంతంలో తీశాం. అక్క‌డ ఎంతోమంది స‌హ‌క‌రించారు. ప్ర‌తి న‌టీన‌టుల‌కూ, టెక్నీషియ‌న్స్ కు మ‌రోసారి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాను. యాక్ష‌న్ సీన్స్‌ను రామ్ ల‌క్ష్మ‌ణ్ బాగా ఓన్ చేసుకుని డిజైన్ చేశారు. వాటికి మంచి పేరు వ‌స్తుంది అన్నారు.

ఈ సినిమా చూశాక పెద్ద బంగార్రాజు పాత్ర ఎక్కువ వుంద‌ని చాలామంది అన్నారు. అది పాత్ర‌ప‌రంగా ద‌ర్శ‌కుడు డిజైన్ చేసిందే. సినిమా చూసిన‌వారంతా వారి భావోద్వేగాలు తెలియ‌జేస్తుంటే, తీసిన సినిమాకు సార్థ‌క‌త ఏర్ప‌డింద‌నిపించింది. బంగార్రాజు సినిమా చూశాక అమ‌ల ఇంటికి రాగానే ఆమె అత్త‌, మామ గారి ఫొటోల‌కు దండం పెట్టుకుని ఏడ్చేసింది అని నాగార్జున తెలిపారు. అవి ఆనందంతో కూడిన క‌న్నీళ్ళు. వారు మ‌న‌ల్ని చూసుకుంటున్నారు క‌దా అని చెప్పింది. వారు మా వెనుక వున్నార‌నే ఫీలింగ్‌ను వ్య‌క్తం చేసింది. ఇదే అభిప్రాయాన్ని చాలామంది వారి అమ్మ‌మ్మ‌లు, నాయ‌న‌మ్మ‌లు, తాత‌య్య‌లు, నాన్న‌ల‌ను గుర్తుచేసుకున్నామ‌ని చెప్పారు.  ఇక ఈ సినిమాలో ముగింపులో చూపిన‌ట్లుగా మ‌రో సినిమాకూడా తీయ‌వ‌చ్చు. ద‌ర్శ‌కుడు ఓ క్లూ కూడా ఇచ్చాడు. ప్ర‌తి 24 ఏళ్ళ‌కు శివాల‌యంలో హోమం చేయాల‌ని.. కానీ ఇప్పుడ‌ప్పుడే సినిమా చేయలేం. ఆలోచించి అన్నీ అనుకూలిస్తే అప్పుడు చూద్దాం అని తెలిపారు నాగార్జున.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Manchu Vishnu family photos: సతి సమేతంగా సంక్రాంతి సంబరాల్లో మా అధ్యక్షుడు మంచు విష్ణు .. (ఫొటోస్)

Ram Charan: ఇక పై అలాంటి సినిమాలు మరిన్ని చేస్తా.. రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్..

Jayamma Panchayathi : కాసింత భోళాతనం.. కూసింత జాలిగుణం.. ఆకట్టుకుంటున్న జయమ్మ పంచాయితీ సాంగ్..