Kamal Haasan: కుర్రహీరో కోసం రంగంలోకి దిగిన యూనివర్సల్ హీరో కమల్ హాసన్..

`రెమో, వ‌రుణ్ డాక్ట‌ర్` చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన త‌మిళ హీరో శివకార్తికేయన్. తాజాగా ఆయన హీరోగా విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ నిర్మాణంలో ఓ చిత్రం రూపొంద‌బోతోంది.

Kamal Haasan: కుర్రహీరో కోసం రంగంలోకి దిగిన యూనివర్సల్ హీరో కమల్ హాసన్..
Kamal
Follow us

|

Updated on: Jan 16, 2022 | 6:30 PM

`రెమో, వ‌రుణ్ డాక్ట‌ర్` చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన త‌మిళ హీరో శివకార్తికేయన్. తాజాగా ఆయన హీరోగా విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ నిర్మాణంలో ఓ చిత్రం రూపొంద‌బోతోంది. తెలుగు, త‌మిళ‌భాష‌ల్లో రూపొంద‌నున్న ఈ చిత్రానికి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భాగ‌స్వామ్యం కావ‌డం విశేషం. ఈ విష‌యాన్ని తెలుగువారి పండుగైన క‌నుమ రోజు (ఆదివారం) అనౌన్స్ చేశారు. ప్ర‌ముఖ సంస్థ సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా తమిళ సినిమాల్లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఈ ఎస్‌పిఎఫ్‌ఐ సంస్థ 2019లో మలయాళంలో  పృథ్వీరాజ్ సుకుమారన్‌తో  ‘నైన్’ చిత్రం నిర్మించింది. తెలుగులో తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో క‌లిసి ‘మేజర్’ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పుడు తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది.  ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (ఆర్‌.కె.ఎఫ్‌.ఐ.)తో నిర్మాణంలో పాలుపంచుకుంది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాకు రాజ్‌కుమార్ పెరియసామి రచన, దర్శకత్వం వహించనున్నారు.

ఈ సంద‌ర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ.. “చక్కటి క‌థ‌, కథనంతో మా బేన‌ర్‌లో 51వ చిత్రం రూపొందుతోంది. ఈ కథ అన్ని ర‌కాలుగా ప్రేక్షకులను ఆలోచించేలా చేస్తుంది. సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియాతో కలిసి పని చేస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను, నటుడు శివకార్తికేయన్, దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ఈ ఆకట్టుకునే కథను వెండి తెరపైకి తీసుకురానున్నారు. అలాగే నటుడు శివకార్తికేయన్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ విన‌గానే నాలోని అన్ని ఎమోష‌న్స్ వ్య‌క్తం అయ్యాయి. కమల్ హాసన్ సార్ వంటి అన్ని శాఖ‌ల‌పై ప‌ట్టున్న దిగ్గజ లెజెండ్ నిర్మాతగా నా సినిమాకు వుండ‌డం చెప్ప‌లేని ఆనందంగా వుంది. దానికితోడు .సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా బ్రాండ్ పేరు నా కెరీర్‌లో మ‌రో మైలురాయిలా నిలుస్తుంది. నా స్నేహితుడు, దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి స్క్రిప్ట్. ఈ ప్రాజెక్ట్ నా కెరీర్‌లో చాలా ముఖ్యమైన చిత్రం అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇక ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను.ష అని పేర్కొన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Manchu Vishnu family photos: సతి సమేతంగా సంక్రాంతి సంబరాల్లో మా అధ్యక్షుడు మంచు విష్ణు .. (ఫొటోస్)

Ram Charan: ఇక పై అలాంటి సినిమాలు మరిన్ని చేస్తా.. రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్..

Jayamma Panchayathi : కాసింత భోళాతనం.. కూసింత జాలిగుణం.. ఆకట్టుకుంటున్న జయమ్మ పంచాయితీ సాంగ్..