Jayamma Panchayathi : కాసింత భోళాతనం.. కూసింత జాలిగుణం.. ఆకట్టుకుంటున్న జయమ్మ పంచాయితీ సాంగ్..

స్టార్ యాంకర్ గా బుల్లితెరపై రాణిస్తున్నారు సుమ. యాంకర్ గా టీవీషోలో కాదు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్స్ లో కూడా సుమ సందడి చేస్తున్నారు.

Jayamma Panchayathi : కాసింత భోళాతనం.. కూసింత జాలిగుణం.. ఆకట్టుకుంటున్న జయమ్మ పంచాయితీ సాంగ్..
Suma
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 16, 2022 | 3:33 PM

Jayamma Panchayathi : స్టార్ యాంకర్ గా బుల్లితెరపై రాణిస్తున్నారు సుమ. యాంకర్ గా టీవీషోలో కాదు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్స్ లో కూడా సుమ సందడి చేస్తున్నారు. ఎలాంటి ఈవెంట్ అయినా సుమ లేకుంటే సందడి ఉండదనేది ప్రేక్షకుల మాట. ఇక సుమ సినిమాల్లోనూ నటించి ఆకట్టుకున్నారు. చాలా కలం క్రితం ఆమె సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించారు. వర్షం సినిమాలో ప్రభాస్ అక్క గా నటించి ఆకట్టుకున్నారు సుమ. ఇక ఇన్నాళ్ల తర్వాత ఆమె తిరిగి సినిమాల్లో నటిస్తున్నారు. తాజగా ఆమె నటించిన జయమ్మ పంచాయితీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జయమ్మ పంచాయితీ సినిమా పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన కథ. విజయ్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా…. బలగా ప్రకాశ్ నిర్మిస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత సుమ ఆచి తూచి ఎంచుకున్న ప్రాజెక్ట్ అవ్వడంతో.. ఇందులో మంచి కంటెంట్ ఉంటుందని జనాలు నమ్ముతున్నారు. కాగా ఈ సినిమా కోసం సుమ తన ఆహార్యంపై కూడా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమానుంచి టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ సినిమానుంచి పాట ను విడుదల చేశారు. “కాసింత భోళాతనం .. కూసింత జాలిగుణం .. కాసింత గండ్రతనం .. కూసింత మొండితనం” అంటూ ఈ పాట జయమ్మ స్వభావానికి అద్దం పడుతూ సాగుతుంది ఈ పాట. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. శ్రీకృష్ణ ఆలాపన ఈ పాటకు ప్రాణం పోశాయి. ఇక సుమ మార్క్ మాటలు కూడా ఈ పాటలో వినిపించాయి. ఆమె ఎక్స్ ప్రెషన్స్ ఈ పాటకి హైలైట్ గా నిలిచాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nandamuri Balakrishna: బీచ్‌లో బాలయ్య సందడి.. ఫ్యామిలీతో కలిసి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి..

Bangarraju: బంగార్రాజు కలెక్షన్ల సునామీ.. రెండో రోజు రికార్డ్స్ క్రియేట్..

Manchu Lakshmi: మంచు లక్ష్మిని స్విమ్మింగ్ ఫూల్‏లో పడేసిన విష్ణు, మోహన్ బాబు.. ఫన్నీ వీడియో వైరల్..