Manchu Lakshmi: మంచు లక్ష్మిని స్విమ్మింగ్ ఫూల్‏లో పడేసిన విష్ణు, మోహన్ బాబు.. ఫన్నీ వీడియో వైరల్..

డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమేజ్

Manchu Lakshmi: మంచు లక్ష్మిని స్విమ్మింగ్ ఫూల్‏లో పడేసిన విష్ణు, మోహన్ బాబు.. ఫన్నీ వీడియో వైరల్..
Follow us

|

Updated on: Jan 16, 2022 | 12:19 PM

డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది మంచు లక్మీ. అటు వెండితెరపైనే కాకుండా.. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలు కుటుంబ సంగతులు షేర్ చేస్తుంటుంది. తాజాగా ఓ ఫన్నీ వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేసుకుంది. అందులో మోహన్ బాబు, మంచు విష్ణు ఇద్దరు కలిసి లక్ష్మిని స్విమ్మింగ్ ఫూల్‏లో ఎత్తిపడేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అ వీడియోలో.. మంచు విష్ణు తన కుటుంబసభ్యులను ఒక్కోక్కరిగా స్విమ్మింగ్ పూల్‏లో నెట్టేస్తు ఉన్నారు. ఇంతలో విష్ణు అందరి వంతు అయిపోయింది కానీ ఇంకా ఒకరు బ్యాలెన్స్ ఉన్నారనుకున్నాడు. వెంటనే లక్ష్మి దగ్గరకు వెళ్లి ఆమెను ఎత్తుకుని పూల్ వైపు నడచాడు. దీంతో లక్ష్మి వద్దంటూ కేకలు పెట్టంది. ఇక మంచు విష్ణు… ఆమెకు ఎత్తుకుని వస్తుంటే.. మోహన్ బాబు లక్ష్మి చేతులు పట్టుకుని విష్ణుకు సహాయం చేస్తూ.. ఆమెను నీళ్లలో పడేశారు. ఈ వీడియోను షేర్ చేస్తూ.. అంతా నా కర్మ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Naga Chaitanya: ఆ విష‌యంలో నాకు స‌మంతే బెస్ట్‌.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన నాగ‌చైత‌న్య‌..

Sumanth’s Malli Modalaindi: ఓటీటీకే ఓటేసిన అక్కినేని హీరో.. డైరెక్ట్ డిజిటల్ రిలీజ్‌కు రెడీ అయిన ‘మళ్లీ మొదలైంది’.

Pushpa Srivalli Dance: శ్రీవల్లి పాటకు స్టెప్పులేసి టీమిండియా క్రికెటర్లు.. అదరగొట్టేశారుగా.!

Anasuya Bharadwaj: అనసూయ తమిళ్ మూవీ నయా పోస్టర్ చూశారా.. ఆకట్టుకుంటోన్న అందాల భామ..