Bangarraju: బంగార్రాజు కలెక్షన్ల సునామీ.. రెండో రోజు రికార్డ్స్ క్రియేట్..

అక్కినేని నాగార్జున.. నాగచైతన్య కలిసి నటించిన లేటేస్ట్ చిత్రం బంగార్రాజు. ఈ చిత్రానికి డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించగా..

Bangarraju: బంగార్రాజు కలెక్షన్ల సునామీ.. రెండో రోజు  రికార్డ్స్ క్రియేట్..
Nagarjuna Bangarraju
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 16, 2022 | 1:56 PM

అక్కినేని నాగార్జున.. నాగచైతన్య కలిసి నటించిన లేటేస్ట్ చిత్రం బంగార్రాజు. ఈ చిత్రానికి డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించగా.. రమ్యకృష్ణ, కృతి శెట్టి కీలకపాత్రలలో నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన ఈమూవీ సూపర్ హిట్ గా నిలిచింది. గత మూడ్రోజులుగా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించగా నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. మొదటి రోజు నుంచి ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది.

ఇక సంక్రాంతి కావడంతో ఈ సినిమాకు భారీగానే ప్రేక్షకులు వీక్షించారు. ఈ సినిమాను నైజంలో రూ. 2.41 కోట్లు.. సీడెడ్ లో రూ. 1.66 కోట్లు, ఉత్తరాంద్రలో రూ.93 లక్షలు రాబట్టడం గమనార్హం. క ఈస్ట్ లో రూ. 88 లక్షలు, వెస్ట్ లో రూ. 49 లక్షలు, గుంటూరులో రూ. 61 లక్షల గ్రాస్ రాబట్టింది. కృష్ణలో రూ.49 లక్షలు, నెల్లూరులో రూ. 32 లక్షలు వసూలు చేసింది. రెండు రోజులుగా రికార్డులు సృష్టిస్తోంది. రెండో రోజు నైజాంలో రూ.4.47 కోట్లు, సీడెడ్ రూ. 3.46 కోట్లు, ఉత్తరాంద్రలో రూ.2.20 కోట్లు రాబట్టింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మొత్తం రెండు రోజుల్లో కలిపి రూ. 36 కోట్లు రాబట్టింది. ఇందుకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

Also Read: Naga Chaitanya: ఆ విష‌యంలో నాకు స‌మంతే బెస్ట్‌.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన నాగ‌చైత‌న్య‌..

Sumanth’s Malli Modalaindi: ఓటీటీకే ఓటేసిన అక్కినేని హీరో.. డైరెక్ట్ డిజిటల్ రిలీజ్‌కు రెడీ అయిన ‘మళ్లీ మొదలైంది’.

Pushpa Srivalli Dance: శ్రీవల్లి పాటకు స్టెప్పులేసి టీమిండియా క్రికెటర్లు.. అదరగొట్టేశారుగా.!

Anasuya Bharadwaj: అనసూయ తమిళ్ మూవీ నయా పోస్టర్ చూశారా.. ఆకట్టుకుంటోన్న అందాల భామ..