Nandamuri Balakrishna: బీచ్‌లో బాలయ్య సందడి.. ఫ్యామిలీతో కలిసి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి..

నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమాలతో బిజీగా ఉండే బాలయ్య. ఫ్యామిలీకి కూడా కావాల్సినంత సమయం కేటాయిస్తూ ఉంటారు.

Nandamuri Balakrishna: బీచ్‌లో బాలయ్య సందడి.. ఫ్యామిలీతో కలిసి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి..
Balakrishna
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 16, 2022 | 2:27 PM

Nandamuri Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమాలతో బిజీగా ఉండే బాలయ్య. ఫ్యామిలీకి కూడా కావాల్సినంత సమయం కేటాయిస్తూ ఉంటారు. సినీ నటుడిగా సుదీర్ఘ కాలంగా సాగుతున్నా.. బాలకృష్ణ వ్యక్తిగత విషయాలు అంతగా ఎవరికీ తెలియదు. ఇదిలా ఉంటే తాజాగా సంక్రాంతి సందర్భంగా బాలకృష్ణ ఫ్యామిలీ తో కలిసి సందడి చేశారు. సంక్రాంతి రోజున తన సోదరి పురంధేశ్వరి అత్తారిల్లు అయిన కారంచేడుకు వెళ్లిన బాలయ్య అక్కడ సందడి చేశారు. సరదాగా గుర్రమెక్కి.. ఆ తర్వాత ఎడ్ల బండి నడిపి అందరిని ఆహ్లాదపరిచారు. తాజాగా ఆయన బీచ్ లో జీపు పై చక్కర్లు కొట్టారు. కారంచేడుకు సమీపంలోని చీరాల బీచ్ కు వెళ్లి సందడి చేశారు. ఈ బీచ్ లో తన సతీమణి వసుంధరతో కలిసి జీపులో చక్కర్లు కొట్టారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

సముద్రపు ఒడ్డున సతీమణిని పక్కన కుర్చోబెట్టుకొని జీపు లో సరదాగా రైడ్ చేశారు. హీరోగా బాలకృష్ణ ఎలా ఉంటారో అందరికి తెలుసు..  ఆయన కుటుంబంతో గడిపే వేళలో ఎలా ఉంటారు? ఎంత సరదాగా ఉంటారన్న విషయాన్నితెలియజేసే వీడియో ఇది. రైడ్ కు వెళుతున్న సమయంలో బాలయ్య థమ్స్ అప్ చూపిస్తే.. ఆయన సతీమణి వసుంధర మాత్రం టాటా చెప్పారు. దాంతో భార్యను టాటా చెప్పకూడదు.. థమ్స్ అప్ చెప్పాలని.. టాటా చెప్పటం అంటే.. సముద్రంలోకి వెళ్లటమే అని సరదాగా అన్నారు బాలయ్య. ఇక ఈ వీడియోను నందమూరి అభిమానులు తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేస్తూ.. మా బాలయ్య బంగారం అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక బాలకృష్ణ సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే బోయపాటితో కలిసి అఖండ సినిమాతో అఖండ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.ఈ  సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే అనీల్ రావిపూడి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నారు బాలయ్య. అలాగే ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కోసం అన్ స్టాపబుల్ అనే టాక్ షో చేస్తున్నారు బాలయ్య. ఈ టాక్ షో రికార్డు స్థాయి రేటింగ్ తో దూసుకుపోతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bangarraju: బంగార్రాజు కలెక్షన్ల సునామీ.. రెండో రోజు రికార్డ్స్ క్రియేట్..

Manchu Lakshmi: మంచు లక్ష్మిని స్విమ్మింగ్ ఫూల్‏లో పడేసిన విష్ణు, మోహన్ బాబు.. ఫన్నీ వీడియో వైరల్..

Lata Mangeshkar: ఇంకా ఐసీయూలోనే లతా మంగేష్కర్.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన డాక్టర్స్..