Acharya: మొదలైన ఆచార్య సందడి.. షూటింగ్ రీస్టార్ట్ చేసిన చిత్రయూనిట్..
ఆచార్య సినిమాకోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ రేడు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించనున్నారు.
Acharya: ఆచార్య సినిమాకోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ లో కనిపించనున్నారు. ఈ సినిమాలో హైలైట్ ఏంటంటే రామ్ చరణ్ నటించడం. చిరంజీవి సినిమాలో చరణ్ నటిస్తున్నాడని తెలిసిన దగ్గర నుంచి ఈ సినిమా పై అభిమానులు అంచనాలు భారీగా పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ అభిమానులు ఆసక్తిని పెంచాయి. ఇక ఈ సినిమాలో చరణ్ చిరు నక్సలైట్స్ గా కనిపించనున్నారు. చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. చరణ్ సరసన పూజ హెగ్డే కనిపించనుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కొరటాల ఆచార్య సినిమా కోసం ఓ సాలిడ్ స్టోరీని ఎంచుకున్నారని టీజర్ చూస్తేనే అర్ధమవుతుంది. తన ప్రతి సినిమాలో సోషల్ మెసేజ్ ఉండేలా చూసే కొరటాల ఈ సినిమా కోసం కూడా అలాంటి కథనే సిద్ధం చేశారు.
ఇక ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ కు చేరుకుంది. ప్రస్తుతం కోకాపేట లో వేసిన భారీ సెట్ లో ఈ సినిమాను షూట్ చేస్తున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా బ్రేక్ పడింది. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గడంతో షూటింగ్స్ తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఈ క్రమంలో ఆచార్య షూటింగ్ కూడా ప్రారంభించారు. నేడు మెగాస్టార్ తోపాటు మిగిలిన వారు కూడా సెట్స్ లో అడుగు పెట్టారు. శరవేగంగా మిగిలిన భాగాన్ని కంప్లీట్ చేసి వీలైనంత త్వరగా సినిమాను విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది.
మరిన్ని ఇక్కడ చదవండి :