చిన్నపిల్లలా మారిన స్టార్ హీరోయిన్.. టాలెంటెడ్ డైరెక్టర్.. త్రోబ్యాక్ వీడియో వైరల్
సెలబ్రెటీలకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు నెట్టింట వైరల్ అవ్వడం చాలా కామన్ అయిపోయింది. ముఖ్యంగా సినిమా తరాలకు సంబంధించినవి..
సెలబ్రెటీలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవ్వడం చాలా కామన్ అయిపోయింది. ముఖ్యంగా సినిమా తరాలకు సంబంధించినవి. అంతే కాదు వారిచిన్నపాటి ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంటాయి. ఇప్పుడు అలాంటి వీడియోనే ఒకటి వైరల్ అవుతుంది. ఈ వీడియోలో కనిపిస్తున్న చిన్నారులిద్దరూ… ఇప్పుడు సెలబ్రిటీలు తెలుసా.. అందులో ఒకరేమో.. సౌత్ ఇండియన్ క్రేజీ హీరోయిన్ కాగా.. మరొకరేమో… స్టార్ డైరెక్టర్ తెలుసా..! ఏంటి నమ్మడంలేదా… అయితే మరోసారి ఈ వీడియోను చూడండి… “ఐ బెట్ యూ.”. ఈ సారి కచ్చింతంగా పట్టేస్తారు.
View this post on Instagram
పట్టేశారు కదా…అవును ఈ చిన్నారి జంట ఎవరో కాదు నయన్ విఘ్నేష్ శివన్. పొద్దుపోకో… లేక ఫన్నీగా ఏదేనా ట్రై చేద్దామనుకున్నారో ఏమో కాని ఇన్‌స్టాగ్రామ్ ఫిల్టర్‌తో చిన్నపిల్లలా మారిపోయారు. పాట పాడుతూ… డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. అయితే ఈ వీడియో పాతదే అయినప్పటికీ… మరో సారి క్రేజీగా నెట్టింట వైరల్ అవుతున్నారు అందర్నీ ఆకట్టుకుంది. ఈ వైరల్ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్లు కురిపిస్తుంది. ఇక నయన్ సినిమాల విషయానికొస్తే తమిళ్, తెలుగు భాషల్లో ఈ అమ్మడు ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం నెట్రికన్, సూపర్ స్టార్ నటిస్తున్న అన్నతే సినిమాలు చేస్తుంది. అలాగే తెలుగులోనూ ఓ సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది. అటు విఘ్నేష్ శివన్ కూడా తన సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ ఇద్దరి పెళ్లి గురించి ఎప్పుడు ప్రశ్నించిన తెలివిగా సమాధానం చెప్తూ తప్పించుకుంటున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :