AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: వైజాగ్ కు వెళ్లనున్న సర్కారువారి పాట టీమ్.. త్వరలో షూటింగ్ షురూ..

ప్రస్తుతం కరోనా మహమ్మారి కాస్త శాంతించింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. దాంతో సినిమా ఇండస్ట్రీలో షూటింగ్ లు తిరిగి ప్రారంభం అవుతున్నాయి.

Mahesh Babu: వైజాగ్ కు వెళ్లనున్న సర్కారువారి పాట టీమ్.. త్వరలో షూటింగ్ షురూ..
Rajeev Rayala
|

Updated on: Jul 07, 2021 | 5:14 PM

Share

Mahesh Babu: ప్రస్తుతం కరోనా మహమ్మారి కాస్త శాంతించింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. దాంతో సినిమా ఇండస్ట్రీలో షూటింగ్ లు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. షూటింగ్స్ ను స్టార్ట్ చేసి.. వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి.. రిలీజ్ చేయాలని చూస్తున్నారు దర్శకనిర్మాతలు. తెలుగులో ఇప్పటికే వాయిదా పడుతూ వస్తున్న సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారువారి పాట సినిమా షూటింగ్ కూడా త్వరలో మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే దుబాయ్ లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా.. కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు తిరిగి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో మహేష్ న్యూ లుక్ లో కనిపించనున్నాడు. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని మొదటినుంచి వినిపిస్తున్న టాక్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

త్వరలోనే ఈ సినిమా షూటింగ్ రీస్టార్ట్ అవ్వనుంది. సర్కారువారి పాట తాజా షెడ్యూల్ ను ‘వైజాగ్’లో ప్లాన్ చేశారట. మహేశ్ బాబు తదితరులపై కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారని అంటున్నారు. ఈ సినిమాలో పరశురామ్ మార్కు ఎంటర్టైనర్ తోపాటు కన్నీళ్లు పెట్టించే ఎమోషన్ కూడా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాతో మొదటిసారి మహేష్ తో జత కడుతుంది కీర్తిసురేష్. గతకొంతకాలంగా సరైన హిట్స్ లేక సతమతం అవుతున్న కీర్తి ఆశలన్నీ ఈ సినిమా పైనే పెట్టుకుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vani Sri: వ్యాంప్ పాత్రల నుంచి స్టార్ హీరోయిన్ గా కళాభినేత్రిగా ఎదిగిన ఈ నటి జీవితం నేటి తరానికి ఆదర్శ వంతం

RAPO 19 : నయా మూవీ షూటింగ్ షురూ చేయనున్న ఎనర్జిటిక్ స్టార్.. ఎప్పటినుంచంటే..

NTR-Atlee Movie: తెలుగు లో అడుగు పెట్టనున్న రాజారాణి డైరెక్టర్ .. ఎన్టీఆర్ తో అట్లీ ప్రేమకథా చిత్రం

Vaishnav Tej: ఉప్పెనలా ఎగసిపడుతున్న ఆఫర్లు .. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో మెగా హీరో. తాజాగా..