AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RAPO 19 : నయా మూవీ షూటింగ్ షురూ చేయనున్న ఎనర్జిటిక్ స్టార్.. ఎప్పటినుంచంటే..

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇటీవల లవర్ బాయ్ నుంచి మాస్ హీరోగా షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో..

RAPO 19 : నయా మూవీ షూటింగ్ షురూ చేయనున్న ఎనర్జిటిక్ స్టార్.. ఎప్పటినుంచంటే..
Rapo
Rajeev Rayala
|

Updated on: Jul 07, 2021 | 4:23 PM

Share

RAPO 19 : ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇటీవల లవర్ బాయ్ నుంచి మాస్ హీరోగా షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో చాక్లెట్ బాయ్ గా కనిపించే రామ్ ఉన్నట్టుండి ఊర మాస్ లుక్ లోకి మారి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన రెడ్ సినిమాలో కూడా అదే కంటిన్యూ చేసాడు. ఇప్పుడు లింగు స్వామి డైరెక్షన్ లో చేసే సినిమా కూడా మాస్ స్టోరీనే అని రకరకాల వార్తలు వినిపించాయి. తమిళ్ డైరెక్టర్ లింగు స్వామి డైరెక్షన్లో రామ్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా   ఉప్పెన క్యూటీ కృతిశెట్టి హీరోయిన్ గానటిస్తోంది. రామ్ కెరీర్ లో 19వ సినిమా ఇది. ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన అప్డేట్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

కరోనా కల్లోలం నుంచి దేశం కాస్త కుదుటపడటంతో సినిమా షూటింగ్ లు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఈ క్రమంలోనే రామ్ సినిమాను కూడా మొదలుపెట్టాలని దర్శకనిర్మాతలు నిర్ణయించుకున్నారు. దీనిపై తాజాగా అధికార ప్రకటన విడుదల చేశారు చిత్రయూనిట్. జులై 12నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకాబోతుందని అనౌన్స్ చేశారు. దీనితో పాటు దర్శకనిర్మాతలతో హీరో హీరోయిన్ కలిసున్నా ఫోటోను విడుదల చేశారు. ఈ ఫొటోలో రామ్ ఎప్పటిలానే సూపర్ స్మార్ట్ గా కనిపించగా.. అందాల కృతి క్యూట్ స్మైల్ తో ఆకట్టుకోంటుంది.ఇక ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనమెంటా..? లేక బ్యూటీఫుల్ లవ్ స్టోరీనా..? అన్నది తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.

మరిన్ని ఇక్కడ చదవండి :

Love Story : రిలీజ్ కు రెడీగా ఉన్న లవ్ స్టోరీ.. థియేటర్స్ తెరవడమే ఆలస్యం..

NTR-Atlee Movie: తెలుగు లో అడుగు పెట్టనున్న రాజారాణి డైరెక్టర్ .. ఎన్టీఆర్ తో అట్లీ ప్రేమకథా చిత్రం

Vaishnav Tej: ఉప్పెనలా ఎగసిపడుతున్న ఆఫర్లు .. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో మెగా హీరో. తాజాగా..