Love Story : రిలీజ్ కు రెడీగా ఉన్న లవ్ స్టోరీ.. థియేటర్స్ తెరవడమే ఆలస్యం..
మజిలీ సినిమాతో రూటుమార్చాడు అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య. ప్రేక్షకులు మెచ్చే కథలను ఆచితూచి ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు.
Love Story : మజిలీ సినిమాతో రూటుమార్చాడు అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య. ప్రేక్షకులు మెచ్చే కథలను ఆచితూచి ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో అందమైన లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమయ్యాడు. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ గానటిస్తోంది. నిజజీవితాలకు దగ్గరగా ఉండే కథలతో సినిమాలు చేయడం శేఖర్ కమ్ముల స్పెషాలిటీ. ఈ సినిమా కూడా అలానే ఉండబోతుందని ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ చూస్తుంటే అర్శమవుతుంది. సారంగదరియా అనే పాట ఇప్పటికే సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోహీరోయిన్లు ఇద్దరు తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు షూటింగ్ కంప్లీట్ చేసి.. ఏప్రిల్లోనే విడుదల చేయాలనుకున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా జరిగిపోయాయి. కానీ కరోనా సెకండ్ వేవ్ ఎంట్రీ తో మళ్ళీ కథ మొదటికొచ్చింది. దాంతో అప్పటినుంచి సినిమాను ఎప్పుడెప్పుడు విడుదల చేద్దామా అని చిత్రయూనిట్ ఎదురుచూస్తోంది.
ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గడంతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. థియేటర్స్ తెరుచుకున్న వెంటనే ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు చిత్రయూనిట్. ఈ నెల 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంతన్నది.. అధికారిక ప్రకటన వస్తేనే గాని తెలియదు.
మరిన్ని ఇక్కడ చదవండి :