దయచేసి సినిమాలను ఓటీటీలకు అమ్మకండి.. నిర్మాతలకు తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ రిక్వెస్ట్..

దయచేసి సినిమాలను ఓటీటీలకు అమ్మకండి.. నిర్మాతలకు తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ రిక్వెస్ట్..
Tsfc

కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ కుదేలైన విషయం తెలిసిందే.  షూటింగ్ లు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు విడుదల తేదీలను వాయిదా వేసుకున్నాయి.

Rajeev Rayala

|

Jul 07, 2021 | 6:22 PM

కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ కుదేలైన విషయం తెలిసిందే.  షూటింగ్ లు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు విడుదల తేదీలను వాయిదా వేసుకున్నాయి. ఈ క్రమంలో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమాలు కొన్ని ఓటీటీ వేదికగా విడుదల అవుతున్నాయి… మరి కొన్ని రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా హాళ్ళను కాపాడమని తెలుగు సినిమా నిర్మాతలకు తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ రిక్వెస్ట్ చేసింది. అక్టోబర్ వరకు ఓటీటీలకు సినిమాలు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు మురళీ మోహన్ మాట్లాడుతూ… “మా అందరి అభిప్రాయం ఒక్కటే..అక్టోబర్‌ 30 వరకు నిర్మాతలందరూ కూడా తమ సినిమాలను ఓటీటీలకు అమ్మకండని రిక్వెస్ట్‌ చేస్తున్నా అన్నారు. ఆ తరువాత కూడా థియటర్స్ తెరుచుకోక పోతే ఓటీటీలకు అమ్ముకోండి. నిర్మాతలెవ్వరూ కూడా ఇప్పుడే ఓటీటీలకు వెళ్లకండి” అని అన్నారు.

అనంతరం తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ సునీల్‌ నారంగ్‌ మాట్లాడుతూ.. ఆగస్ట్‌ మొదటి వారంలో అంతా సద్దుమణిగేట్టు కనిపిస్తోంది. చిన్నవాళ్లు అమ్ముకున్నారంటే పర్లేదు.. కనీసం పెద్ద వాళ్లు అయినా కూడా ఆపుకోవాలి కదా?. కనీసం అక్టోబర్‌ 30 వరకైనా ఆపుకోండి. సినిమాను కాపాడండి. ఓటీటీకి సినిమాలు ఇవ్వకండి..నేను కూడా సినిమాలు తీస్తున్నా. నేను కూడా నిర్మాతనే. నాక్కూడా ఆ బాధలు తెలుసు అని అన్నారు. నిర్మాత కంటే డిస్ట్రిట్యూబర్స్, ఎగ్జిబిటర్స్‌ ఎక్కువ బాధలు పడుతున్నారు. అందుకని, ఓటీటీకి సినిమాలు ఇవ్వకండి. ఒకవేళ అక్టోబర్ 31వరకు థియేటర్లు ఓపెన్ కాకపోతే అప్పుడు ఇచ్చుకోండి అని అన్నారు. అలాగే మేం నిర్మించిన ‘లవ్ స్టోరీ’ సినిమాకు పది ఆఫర్లు వచ్చాయి. అయినా ఓటీటీలకు ఇవ్వలేదు. మా రిక్వెస్ట్‌ను నిర్మాతలందరూ వింటారని అనుకుంటున్నాను.. నమస్కారం పెట్టి మరీ రిక్వెస్ట్‌ చేస్తున్నాను. హీరోలకు కూడా ఓటీటీలకు సినిమాలు ఇవ్వడం ఇష్టం లేదు. వాళ్ళు మాకు మద్దతు ఇస్తారు. థియేటర్లు ఓపెన్ అయితే ఓటీటీలు 40, 50 కోట్ల ఆఫర్లు ఇవ్వవు. థియేటర్స్ ప్రజెంట్ క్లోజ్ ఉన్నాయి కాబట్టి అంత అమౌంట్ ఇస్తున్నాయి. అందుకని, అక్టోబర్ వరకు వెయిట్ చేయండి’ అని అన్నారు.

తెలంగాణ థియేటర్స్‌ ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు విజయేందర్‌ రెడ్డి మాట్లాడుతూ – ‘‘ ‘ఓటీటీ చట్టం కల్పించిన హక్కు కానే కాదు. సినిమాలను ఎవ్వరికైనా అమ్ముకోడం నిర్మాత హక్కు. నిర్మాతలం మాకు హక్కు ఉంటుందని కాకుండా.. అక్టోబర్‌ వరకు ఎదురు చూడండి. అక్టోబర్‌ వరకు పరిస్థితు సద్దుమణకపోతే, ప్రభుత్వాలు అనుమతి ఇవ్వకపోతే, కరోనా తగ్గకపోతే అప్పుడు ఓటీటీకి వెళ్లండి. నిర్మాతలందరికీ ఇది మా రిక్వెస్ట్‌. అందరూ ఓపికతో ఉండండి. థియేటర్ వ్యవస్థను ఓటీటీలు కిల్ చేయడానికి చూస్తున్నాయి అన్నారు.

తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ మాట్లాడుతూ.. ‘ఓటీటీల గురించి నిర్మాతలందరినీ మేం రిక్వెస్ట్ చేస్తున్నాం. అలా కాకుండా.. వాళ్లు తమ ఇష్టం మేరకు వెళ్తే.. మేం ఏం చేయాలో అది చేస్తాం.. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చేసి చూపెట్టాం.. అది వారికి తెలియడం లేదు.. ఇప్పుడైతే మేం రిక్వెస్ట్ చేస్తున్నాం.. నిన్న కూడా రిక్వెస్ట్ చేసినం.. భవిష్యత్ అంతా కూడా సినిమా పరిశ్రమదే, థియేటర్లదే. ఇంకా 25 ఏళ్లు అయినా 50 ఏళ్లు అయినా కూడా థియేటర్ బతికే ఉంటుంది.. ఇది నా అభిప్రాయం’ అని అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

సూపర్ స్టార్ కు జోడిగా లేడీ సూపర్ స్టార్..?హ్యాట్రిక్ కోసం భారీగా ప్లాన్ చేస్తున్న మాటల మాంత్రికుడు..:nayanthara and mahesh babu Video.

చిన్నపిల్లలా మారిన స్టార్ హీరోయిన్.. టాలెంటెడ్ డైరెక్టర్.. త్రోబ్యాక్ వీడియో వైరల్

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu