Varun Tej: హైదరాబాద్లో వరుణ్ తేజ్ లైఫ్ స్టైల్.. కార్లంటే అమితమైన ఇష్టం.. ఎన్ని ఉన్నాయంటే..
ఇప్పటికే కాక్ టైల్ పార్టీకి సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అందులో బన్నీ, స్నేహారెడ్డి,ఉపాసన, చరణ్ కనిపిస్తున్నారు. ఈరోజు ఉదయం హల్దీ వేడుకలు జరగ్గా.. సాయంత్రం మెహందీ వేడుక జరగనుంది. ఇక రేపు మధ్యాహ్నం 2 గంటల 48 నిమిషాలకు వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. అదే రోజు సాయంత్రం రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు నెటిజన్స్.

మెగా హీరో వరుణ్ తేజ్.. హీరోయిన్ లావణ్యత్రిపాఠి వివాహం నవంబర్ 1న ఇటలీలోని టస్కానీలో జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగా, అల్లు కుటుంబసభ్యులతోపాటు.. లావణ్య కుటుంబీకులు, టాలీవుడ్ సినీ ప్రముఖులు, సన్నిహితులు ఇటలీ చేరుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నితిన్ సహా మిగతా నటీనుటులు ప్రస్తుతం ఇటలీలోనే ఉన్నారు. అక్టోబర్ 30 రాత్రి నుంచి సంగీత్, కాక్ టైల్ పార్టీ జరగ్గా.. అక్టోబర్ 31న మెహందీ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాక్ టైల్ పార్టీకి సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అందులో బన్నీ, స్నేహారెడ్డి,ఉపాసన, చరణ్ కనిపిస్తున్నారు. ఈరోజు ఉదయం హల్దీ వేడుకలు జరగ్గా.. సాయంత్రం మెహందీ వేడుక జరగనుంది. ఇక రేపు మధ్యాహ్నం 2 గంటల 48 నిమిషాలకు వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. అదే రోజు సాయంత్రం రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు నెటిజన్స్.
మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హైదరాబాద్ లైఫ్ స్టైల్ గురించి ఆరా తీస్తున్నారు. 1990 జనవరి 19న జన్మించిన వరుణ్.. 2000లో తన తండ్రి నటించిన హేండ్సప్ సినిమాల బాలనటుడిగా కనిపించిన వరుణ్.. ఆ తర్వాత 2014లో ముకుంద సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా హిట్ కాలేకపోయింది. ఆ తర్వాత కంచె, లోఫర్, మిస్టర్, ఫిదా సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుణ్ చివరిసారిగా ఈ ఏడాది గాంఢీవదారి అర్జున సినిమాలో నటించారు. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న మట్కా చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. అయితే వరుణ్ పెళ్లి వేడుకలు ప్రారంభంకాబోతుండడంతో ఈ సినిమా చిత్రీకరణకు బ్రేక్ పడింది.
Last night at the cocktail party 🎉 @AlwaysRamCharan @upasanakonidela @IAmVarunTej @Itslavanya @alluarjun#VarunLav pic.twitter.com/kXEX2Wlqh0
— John Wick (@JohnWick_fb) October 31, 2023
View this post on Instagram
ఇప్పటి వరకు వరుణ్ తేజ్ దాదాపు రూ. 50 కోట్లు సంపాదించినట్లుగా తెలుస్తోంది. ఇక టాలీవుడ్‌లోని ఇతర ప్రముఖుల మాదిరిగానే వరుణ్ తేజ్ కూడా ఆటోమొబైల్ ప్రియుడు. విలాసవంతమైన కార్ల పట్ల అతనికున్న మక్కువ చాలా మంది దృష్టిని ఆకర్షించింది. వరుణ్ తేజ్ వద్ద ఉన్న కార్ల కలెక్షన్ గురించి తెలుసుకుందాం.
వరుణ్ తేజ్ కార్ కలెక్షన్ :
- BMW 760 Li – రూ. 2 కోట్లు
- ల్యాండ్ రోవర్ డిఫెండర్ – రూ. 2.3 కోట్లు
- టొయోటో వెల్‌ఫైర్ – రూ. 1.2 కోట్లు
- కియా కార్నివాల్ – రూ. 40 లక్షలు
2017లో విడుదలైన మిస్టర్ సినిమాలో వరుణ్ తేజ్, లావణ్య కలిసి నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. రేపు (నవంబర్ 1న) మధ్యాహ్నం వీరిద్దరి వివాహం ఇటలీలోని టస్కానీలో జరగనుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




