Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Leo Movie: ‘లియో’ ఓటీటీ రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్.. థియేటర్ మూవీకి పూర్తిగా కొత్త వెర్షన్ ?

లోకేష్ తెరకెక్కించిన సినిమాటిక్ యూనివర్స్ లో ఖైదీ, విక్రమ్ సినిమాల తర్వాత విడుదలైన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుంది. ఇప్పటి వరకు విజయ్ కెరీర్‏లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఈ సినిమాకు ఇప్పుడు వసూళ్లు కాస్త డల్ అయ్యాయి. ఇందులో విజయ్ సరసన త్రిష కథానాయికగా నటించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదలయ్యేందుకు సిద్ధమయ్యిందని టాక్ వినిపిస్తోంది. అయితే థియేటర్.. ఓటీటీ విడుదలకు కాస్త ఢిఫరెంట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Leo Movie: 'లియో' ఓటీటీ రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్.. థియేటర్ మూవీకి పూర్తిగా కొత్త వెర్షన్ ?
Leo Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 31, 2023 | 4:15 PM

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‏తో దూసుకుపోతున్న సినిమా ‘లియో’. కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి నటించిన ఈ చిత్రానికి తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రానికి డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించడం.. విజయ్ మాస్ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. లోకేష్ తెరకెక్కించిన సినిమాటిక్ యూనివర్స్ లో ఖైదీ, విక్రమ్ సినిమాల తర్వాత విడుదలైన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుంది. ఇప్పటి వరకు విజయ్ కెరీర్‏లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఈ సినిమాకు ఇప్పుడు వసూళ్లు కాస్త డల్ అయ్యాయి. ఇందులో విజయ్ సరసన త్రిష కథానాయికగా నటించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదలయ్యేందుకు సిద్ధమయ్యిందని టాక్ వినిపిస్తోంది. అయితే థియేటర్.. ఓటీటీ విడుదలకు కాస్త ఢిఫరెంట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

లియో సినిమా థియేటర్లలో విడుదలైన వెర్షన్ కు ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమా కాస్త విభిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ప్లాష్ బ్యాక్ లోని 18 నుంచి 20 నిమిషాల భాగం కేవలం ఫ్యాన్స్ కోసం మాత్రమే చిత్రీకరించిందని… కానీ ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమా వెర్షన్ మాత్రం దీనికి భిన్నంగా ఉంటుందని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు లోకేష్. క్లైమాక్స్ లో లియో తనకు తానుగా ఆంటోని దాస్ కు చెప్పే వెర్షన్ కేవలం ఓటీటీలో మాత్రమే ఉంటుందని అన్నారు. దీంతో లియో సినిమా ఓటీటీ వెర్షన్ స్ట్రీమింగ్ కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్, మన్సూర్ అలీ ఖాన్, మిస్కిన్, మడోన్నా సెబాస్టియన్, ప్రియా ఆనంద్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అదే సమయంలో లియో సినిమా గురించి ఆసక్తికర విషయం బయటపెట్టారు లోకేష్. ముందుగా వేరే హీరోను దృష్టిలో పెట్టుకుని లియో కథ రాశానని.. కానీ మాస్టర్ సినిమాలో విజయ్ దళపతితో కలిసి పనిచేసిన తర్వాత అతడి కోసమే కథ మార్చినట్లు చెప్పుకొచ్చారు. మొత్తానికి లియో సినిమా ఓటీటీ స్ట్రీమంగ్ కంటే ముందే మరింత క్యూరియాసిటిని పెంచేశారు డైరెక్టర్ లోకేష్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శాంతి వైపే భారత్ అడుగులు.. వైరం ఎప్పటికీ కోరదు..
శాంతి వైపే భారత్ అడుగులు.. వైరం ఎప్పటికీ కోరదు..
IPL 2025: ఆర్‌సీబీలో విరాట్ కోహ్లీ రీప్లేస్‌మెంట్ వీళ్లే భయ్యా
IPL 2025: ఆర్‌సీబీలో విరాట్ కోహ్లీ రీప్లేస్‌మెంట్ వీళ్లే భయ్యా
లెక్స్‌ ఫ్రిడ్‌మన్‌తో ప్రధాని మోదీ పాడ్‌కాస్ట్.. వివేకుని మాటే..
లెక్స్‌ ఫ్రిడ్‌మన్‌తో ప్రధాని మోదీ పాడ్‌కాస్ట్.. వివేకుని మాటే..
బాల్యంలో పేదరికం.. కానీ ఎప్పుడూ అది బరువుగా అనిపించలేదు: మోదీ
బాల్యంలో పేదరికం.. కానీ ఎప్పుడూ అది బరువుగా అనిపించలేదు: మోదీ
ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. ఆ కీలక నిబంధనల మార్పు
ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. ఆ కీలక నిబంధనల మార్పు
ఈ స్కేరీ గేమ్ ఆడితే చావు తప్పదు!సడెన్‌గా ఓటీటీలోకి థ్రిల్లర్ మూవీ
ఈ స్కేరీ గేమ్ ఆడితే చావు తప్పదు!సడెన్‌గా ఓటీటీలోకి థ్రిల్లర్ మూవీ
ఇది కదా దయాగాడి దండయాత్ర..
ఇది కదా దయాగాడి దండయాత్ర..
మూడేళ్లల్లో ఎఫ్‌డీలపై ముచ్చటైన రాబడి..ది బెస్ట్ మూడు బ్యాంకులివే!
మూడేళ్లల్లో ఎఫ్‌డీలపై ముచ్చటైన రాబడి..ది బెస్ట్ మూడు బ్యాంకులివే!
ఐపీఎల్‌లో డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే.. కోహ్లీకి మాత్రం నో ప్లేస్
ఐపీఎల్‌లో డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే.. కోహ్లీకి మాత్రం నో ప్లేస్
చూసే చూపులోనే ఉందంతా.. మీరెలాంటి వారో మీ చూపే చెప్తుంది! ఎలాగంటే
చూసే చూపులోనే ఉందంతా.. మీరెలాంటి వారో మీ చూపే చెప్తుంది! ఎలాగంటే