Varun Tej: షాక్ ఇస్తున్న మెగా హీరో రెమ్యునరేషన్.. వరుణ్ తేజ్ ఒక్కొక్క సినిమాకు ఎంత అందుకుంటున్నాడో తెలుసా..
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా వచినవాళ్ళందరూ దాదాపు సక్సెస్ అయ్యారు.. కేవలం ఫ్యామిలీ మైలేజ్ తో కాకుండా తమ టాలెంట్ తో ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నారు.
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా వచినవాళ్ళందరూ దాదాపు సక్సెస్ అయ్యారు.. కేవలం ఫ్యామిలీ మైలేజ్ తో కాకుండా తమ టాలెంట్ తో ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నారు. వీరిలో ఒకరు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej). కెరీర్ బిగినింగ్ నుంచి కథలకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ.. తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ముకుంద సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు వరుణ్. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు వరుణ్. మొదటి సినిమాతోనే మెచూరిటీ ఉన్న యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ హీరో. ముకుంద తర్వాత వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. కంచె , లోఫర్, ఫిదా , తొలిప్రేమ, ఎఫ్ 2 సినిమాలతో సక్సెస్ లను అందుకున్నాడు. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గద్దల కొండ గణేష్ సినిమాతో నటనలో నెక్స్ట్ లెవల్ కు వెళ్ళాడు వరుణ్.
నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో వరుణ్ అదరగొట్టాడనే చెప్పాలి. ఇక ఇప్పుడు గని గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో వరుణ్ పోఫిషనల్ బాక్సర్ గా కనిపించనున్నాడు. కిరణ్ కొర్రిపాటి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ఏప్రిల్ 8 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించగా.. ఉపేంద్ర సునీల్ శెట్టి కీలక పాత్రలను పోషించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు వరుణ్ రెమ్యునరేషన్ గురించి ఫిలిం సర్కిల్స్ లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. వరుణ్ తన రెమ్యునరేషన్ పెంచేశాడని టాక్ నడుస్తుంది. ఇప్పటివరకు ఒకొక్క సినిమాకు 8 కోట్ల వరకు తీసుకుంటూ వస్తున్న వరుణ్.. తన నెక్స్ట్ సినిమాకు ఏకంగా 12 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ కొత్త ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా అలరించబోతోంది. ఈ సినిమాకోసం వరుణ్ 12 కోట్లు అందుకుంటున్నాడట. మరి ఈవార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి :