Sai Dharam Tej Birthday: మెగా హీరో బర్త్ డే స్పెషల్.. సాయితేజ్ 15 టీజర్ రిలీజ్ అయ్యేది అప్పుడే..
అక్టోబర్ 15న సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో తేజ్ తన చేతిలో ఒక కాగడా పట్టుకొని నిలబడి ఉండగా.. అతని ఎదురుగా అనేక మంది నిలబడి ఉన్నారు.
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా అరంగేట్రం చేసి తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్. ఎన్నో హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఈ హీరో.. ప్రస్తుతం కార్తక్ దండు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. సాయి తేజ్ కెరీర్లో 15వ చిత్రంగా వస్తున్న ఈ మూవీ ప్రస్తుతం SD15 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపోందుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది . అక్టోబర్ 15న సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో తేజ్ తన చేతిలో ఒక కాగడా పట్టుకొని నిలబడి ఉండగా.. అతని ఎదురుగా అనేక మంది నిలబడి ఉన్నారు. తేజ్ ఫేస్ కనిపించకుండా డిజైస్ చేసిన ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.
ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇందులో సాయితేజ్ సరసన భీమ్లానాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తోంది. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సుకుమార్ రైటింగ్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అంతేకాకుండా డైరెక్టర్ సుకుమార్ సైతం ఈ సినిమా నిర్మాణంలో భాగమయ్యారు.
స్టోరీ, స్క్రీన్ ప్లే విషయంలో సహకారం అందిస్తున్నారు. ఈ సినిమాకు శ్యామ్దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ మూవీకి సంబంధఇంచిన పూర్తి అప్డేట్స్ త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపారు.
Celebrating our Supreme Hero @IamSaiDharamTej b’day with an Intriguing Poster from #SDT15 ?
Title reveal with Sneak peek video ?
Mystery Unveils, Summer 2023 ✅@karthikdandu86 @iamsamyuktha_ @AJANEESHB @Shamdatdop @aryasukku @BvsnP @bkrsatish @SVCCofficial @SukumarWritings pic.twitter.com/JVLdsdyLkc
— SVCC (@SVCCofficial) October 15, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.