Prabhas: కాంతార సినిమాపై ప్రభాస్ రివ్యూ.. క్లైమాక్స్ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన డార్లింగ్..

కర్ణాటకలో అతి పెద్ద విజయాన్ని సాధించడంతో ఈ సినిమాను ఇతర భాషలలో విడుదల చేస్తున్నారు. అక్టోబర్ 15న ఈ మూవీ తెలుగులో రిలీజ్ అయ్యింది. తాజాగా ఈ సినిమాపై పై ప్రభాస్ రివ్యూ ఇచ్చారు.

Prabhas: కాంతార సినిమాపై ప్రభాస్ రివ్యూ.. క్లైమాక్స్ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన డార్లింగ్..
Prabhas, Kantara Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 15, 2022 | 8:22 AM

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన లేటేస్ట్ చిత్రం కాంతారా. సెప్టెంబర్ 30న కర్ణాటకలో విడుదలైన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అతి తక్కువ సమయంలోనే భారీగా వసూల్లు సాధించింది. కేజీఎఫ్ వంటి సంచలనాన్ని నిర్మించిన హోంబలే ఫిల్మ్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కర్ణాటకలో అతి పెద్ద విజయాన్ని సాధించడంతో ఈ సినిమాను ఇతర భాషలలో విడుదల చేస్తున్నారు. అక్టోబర్ 15న ఈ మూవీ తెలుగులో రిలీజ్ అయ్యింది. తాజాగా ఈ సినిమాపై పై ప్రభాస్ రివ్యూ ఇచ్చారు. ఈ సినిమాను చూసిన డార్లింగ్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ మూవీ తనను చాలా ఇంప్రెస్ చేసిందని.. అందుకే రెండుసార్లు చూసినట్లు వెల్లడించారు. ఈ చిత్రం ద్వారా ప్రత్యేకమైన కాన్సెప్ట్ తెలియజేశారని ప్రశంసించారు.

కాంతార చిత్రాన్ని రెండవసారి చూశాను. ఇది అసాధారణమైన అనుభవం. నిజంగా ఇది అద్భుతమైన కాన్సెప్ట్. అలాగే థ్రిల్లింగ్ క్లైమాక్స్. ఈ సినిమాను తప్పకుండా థియేటర్లలో చూడాలి అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ప్రభాస్.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సలార్ చిత్రాన్ని కూడా హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది.

హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి నటించిన ఈ సినిమా కాంబ్లా, బూటాకోలా సంప్రదాయ సంస్కృతిని తెలియజేస్తుంది. ఇందులో కిషోర్, అచ్యుత్ కుమార్, ప్రకాష్ తుమినాడ్, ప్రమోద్ శెట్టి, నవీన్ డి పాడిల్ కీలకపాత్రలలో నటించారు. ఈ సినిమా మలయాళం డబ్బింగ్ వెర్షన్ అక్టోబర్ 20న కేరళలలో విడుదల కానుంది. మరోవైపు అక్టోబర్ 14న హిందీలో విడుదలైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?