Bimbisara: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న త్రిగర్తల సామ్రాజ్యాధిపతి.. ‘బింబిసార’ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది..

దసరాకు రాకపోతే దీపావళీకి కచ్చితంగా వస్తుందంటూ నెట్టింట ప్రచారం నడిచింది. తాజాగా ప్రేక్షకుల ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెట్టేస్తూ.. బింబిసార్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ అధికారికంగా ప్రకటించింది జీ5.

Bimbisara: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న త్రిగర్తల సామ్రాజ్యాధిపతి.. 'బింబిసార' స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది..
Bimbisara
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 15, 2022 | 7:26 AM

చాలా కాలం నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన చిత్రం బింబిసార. ఆగస్ట్ 5న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అతి పెద్ద విజయాన్ని సాధించిన చిత్రంగా నిలిచింది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. థియేటర్‏లో సూపర్ హిట్‏గా నిలిచిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సంగతి తెలిసిందే. ముందుగా దసరా కానుగా అక్టోబర్ 5 నుంచి ఈ మూవీ జీ5లో స్ట్రీమింగ్ అవుతుందని వార్తలు వినిపించాయి. ఆ తర్వాత అక్టోబర్ 7న రానున్నట్లుగా టాక్ నడిచింది. కానీ బింబిసార స్ట్రీమింగ్ కాలేదు. దీంతో దసరాకు రాకపోతే దీపావళీకి కచ్చితంగా వస్తుందంటూ నెట్టింట ప్రచారం నడిచింది. తాజాగా ప్రేక్షకుల ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెట్టేస్తూ.. బింబిసార్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ అధికారికంగా ప్రకటించింది జీ5.

దీపావళీ కానుకగా ఈ మూవీ అక్టోబర్ 21న స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది జీ5. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఓ స్పెషల్ వీడియోను షేర్ చేస్తూ..కింద ఒకడు ఉన్నాడు, వాడి పేరు బింబి, త్రిగర్తల సామర్జ్యాధిపతి బింబిసారుడు అని చెప్పండి!!! అంటూ రాసుకొచ్చింది.

ఈ సినిమాను నూతన దర్శకుడు వశిష్ట తెరకెక్కించారు. ఈ ఫాంటసీ యాక్షం చిత్రంలో భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్, కేథరిన్ కథానాయికలుగా నటించారు. ఇందులో కళ్యాణ్ రామ్ బింబిసారుడు, దేవదత్తుడు అనే రెండు విభిన్న పాత్రలు పోషించాడు. క్రీస్తు పూర్వం 500 సంవత్సరానికి చెందిన త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసారుడు మాయదర్పణం కారణంగా ప్రస్తుతానికి వస్తాడు. ఈ వర్తమానంలోకి వచ్చిన బింబిసారుడికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి ?.. విధి అతనికి ఎలాంటి పాఠాలు నేర్పింది ? ఆ కాలంలో ఆయన దాచిన నిది తలుపులు తెరవడం కోసం ఈ కాలంలో సుబ్రహ్మణ్యశాస్త్రి ఎందుకు ప్రయత్నిస్తుంటాడు ? బింబిసారుడు తిరిగి తన కాలానికి ఎలా వెళ్లాడు ? అనేది స్టోరీ.

జీ5 ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?