Raviteja Eagle Teaser: పవర్ ఫుల్‌గా రవితేజ కొత్త సినిమా టీజర్.. ఆసక్తిని రేకెత్తిస్తోన్న వీడియో..
ప్రస్తుతం మాస్ మాహారాజా టైగర్ నాగేశ్వర రావు చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో రేణు దేశాయ్ కీలకపాత్రలో నటిస్తుంది. ఈ సినిమాతో వెండితెరపైకి రీఎంట్రీ ఇస్తుంది రేణు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు రవితేజ కొత్త సినిమాకు సంబంధించిన టైటిల్, టీజర్ రిలీజ్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్.

మాస్ మాహారాజా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే వాల్తేరు వీరయ్య, ధమాకా చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఈ హీరో.. ఇక రావణాసుర సినిమాతో విలనిజం చూపించారు. బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఓటీటీలో మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. చాలా కాలం తర్వాత పూర్తిగా నెగిటివ్ షెడ్స్‌లో రవితేజ నటన వేరేలెవల్. ప్రస్తుతం మాస్ మాహారాజా టైగర్ నాగేశ్వర రావు చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో రేణు దేశాయ్ కీలకపాత్రలో నటిస్తుంది. ఈ సినిమాతో వెండితెరపైకి రీఎంట్రీ ఇస్తుంది రేణు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు రవితేజ కొత్త సినిమాకు సంబంధించిన టైటిల్, టీజర్ రిలీజ్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్.
రవితేజ ప్రధాన పాత్రలో డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు EAGLE అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. టీజర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అందులో మాస్ మహారాజా మరింత పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. ‘కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు’ అని నవదీప్ చెప్పడం..’ ఒక మనిషి చుట్టూ ఇన్ని కథలు ఏంటీ.. ఒక వ్యక్తికి ఇన్ని అవతారాలు ఏంటీ ?’అంటూ అనుపమ పరమేశ్వరన్ చెప్పే డైలాగ్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల కీలకపాత్రలలో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దావ్ జాంద్ సంగీతం అందిస్తున్నారు. ఇక రవితేజ నటిస్తోన్న ఈ కొత్త ప్రాజెక్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.




మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



