Movie Tickets: సినిమా ప్రియులకు బంపరాఫర్.. ఆ పేరు ఉన్న 200 మందికి ఉచితంగా మూవీ టికెట్లు.. వివరాలు ఇదిగో
కేరింత సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు పార్వతీశం. ఇందులో అతని స్లాంగ్, యాక్టింగ్ అందరికీ తెగ నచ్చేసింది. ఈ సినిమా తర్వాత కొన్ని మూవీస్ లోనూ నటించాడు పార్వతీశం. ఇప్పుడు మరో కొత్త మూవీతో మన ముందుకు వస్తున్నాడు. డైరెక్టర్ వీఎస్ ముఖేశ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాతో ప్రణీకాన్వికా హీరోయిన్‌గా హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కానుంది.

కేరింత సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు పార్వతీశం. ఇందులో అతని స్లాంగ్, యాక్టింగ్ అందరికీ తెగ నచ్చేసింది. ఈ సినిమా తర్వాత కొన్ని మూవీస్ లోనూ నటించాడు పార్వతీశం. ఇప్పుడు మార్కెట్ మహాలక్ష్మి అంటూ మరో మూవీతో మన ముందుకు వస్తున్నాడు. డైరెక్టర్ వీఎస్ ముఖేశ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాతో ప్రణీకాన్వికా హీరోయిన్‌గా హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కానుంది. హర్ష వర్దన్, ముక్కు అవినాశ్, మహబూబ్ బాషా తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న మార్కెట్ మహాలక్ష్మి మార్చి 29న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ప్రమోషన్లలో భాగంగా రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే ప్రమోషన్లలో భాగంగా ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది మార్కెట్ మహాలక్ష్మి చిత్ర బృందం. మహాలక్ష్మి పేరుతో ఉన్న వారికి తమ సినిమా టికెట్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మొత్తం 200 టికెట్లను ఇలా ఉచితంగా ఇవ్వనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియోను రిలీజ్ చేసింది. ‘ మీ ఇంట్లో ఎవరైనా మహాలక్ష్మి అనే పేరుతో ఉన్నారా? ఒక వేళ ఆ పేరుతో ఎవరైనా ఉంటే వెంటనే మీ ఐడీ ప్రూఫ్‌ను 9005500559కి వాట్సాప్ చేయండి’ అంటూ వీడియోలో చెప్పుకొచ్చారు హీరో, హీరోయిన్లు.
ఇలా మొత్తం టాప్-200 మహాలక్ష్ములకు మార్కెట్ మహాలక్ష్మి సినిమా టికెట్లను ఫ్రీగా ఇస్తున్నామని ప్రకటించారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీ ఇంట్లో ఎవరైనా మహాలక్ష్ములు ఉంటే వెంటనే ఐడీ ప్రూఫ్స్ ను పైన చెప్పిన నంబర్ కు వాట్సాప్ చేసి టికెట్స్ ఉచితంగా పొందండి. ఓ సాఫ్ట్ వేర్ కుర్రోడు మార్కెట్ లో కూరగాయలు అమ్మే అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది అనే కథాంశంతో ఈ ‘మార్కెట్ మహాలక్ష్మి’ సినిమా రూపొందింది. టీజర్స్, ట్రైలర్ ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి.
View this post on Instagram
మార్కెట్ మహాలక్ష్మి ట్రైలర్
View this post on Instagram
మార్కెట్ మహాలక్ష్మి తో పార్వతీశం..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








