Kannappa: కన్నప్ప హార్డ్ డ్రైవ్ మాయం.. ప్రభాస్ సీన్స్ మొత్తం ఆ డైవ్‌లోనే.. ఫ్యాన్స్‌లో టెన్షన్
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన హార్డ్ డ్రైవ్ మాయమైనట్లు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ అనుమతి లేకుండా హార్డ్ డ్రైవ్ తీసుకెళ్లారని ఫిల్మ్ నగర్ పోలీసులకు తెలిపారు.

మంచు విష్ణు నటిస్తున్న సినిమా కన్నప్ప. బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో చాలా మంది స్టార్ నటీనటులు నటిస్తున్నారు. నటుడు, డాక్టర్ మోహన్ బాబు కన్నప్ప సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, ఐశ్వర్య రాజేష్, శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల, ముఖేష్ రిషి, కరుణాస్, యోగి బాబు, సప్తగిరి, రఘు బాబు, , దేవరాజ్, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా (విష్ణు కూతుళ్లు) ఇలా ఎందరో స్టారాది స్టార్స్ ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు. తెలుగుతో పాటు హిందీ, మలయాళం, కన్నడ, తమిళ్.. ఇలా పలు ప్రాంతీయ భాషల్లో కన్నప్ప సినిమా రిలీజ్ కానుంది.
ఇది కూడా చదవండి : అప్పుడు స్టార్ హీరోలు నాకోసం ఎదురుచూసేవారు.. కానీ ఇప్పుడు అవకాశాలు ఇవ్వడంలేదు..
కన్నప్ప సినిమా ఇప్పటికే రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకుంటూ వచ్చింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు సినిమా రాబోతుంది అనుకునేలోగా ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన గ్రాఫిక్స్ డేటా ఉన్న హార్డ్ డ్రైవ్ మాయమైనట్లు వార్తలు వచ్చాయి. ముంబైలోని హైవ్ స్టూడియోస్ నుంచి ఈ హార్డ్ డ్రైవ్‌ను డీటీడీసీ కొరియర్ ద్వారా హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో ఉన్న 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయానికి పంపారు. ఈ పార్సిల్‌ను మే 25, 2025న ఆఫీస్ బాయ్ రఘు తీసుకున్నాడు, కానీ అతను దానిని చరిత అనే మహిళకు అప్పగించాడు. అప్పటి నుంచి వారిద్దరూ అజ్ఞాతంలో ఉన్నారు.
ఇది కూడా చదవండి : అది దా సర్‌ప్రైజ్..! ఖలేజా మూవీ దిలావర్ సింగ్ భార్య గుర్తుందా.. ఇప్పుడు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే
ఈ హార్డ్ డ్రైవ్‌లో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు, ముఖ్యంగా ప్రభాస్ నటించిన యాక్షన్ సీన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభాస్ కు సంబధించిన ముఖ్యమైన సన్నివేశాలు.. యాక్షన్ సీన్స్ అన్ని ఆ డ్రైవ్ లోనే ఉన్నాయట. ఈ ఘటన వల్ల సినిమా కంటెంట్ ఆన్‌లైన్‌లో లీక్ అయ్యే అవకాశం ఉందని చిత్ర బృందం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎగ్జిక్యూటివ్ నిర్మాత రెడ్డి విజయ్ కుమార్ ఈ విషయంపై ఫిల్మ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు, దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇది కూడా చదవండి : చిన్నవయసులోనే ప్రేమలో పడింది.. పెళ్లికోసం మతం మార్చుకుంది.. 18ఏళ్లకు దారుణమైన చావు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








