AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : 8 సినిమాలు చేస్తే 7అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.. ఆఫర్స్ లేక ఇప్పుడు ఇలా

సినిమా ఇండస్ట్రీలో హిట్స్, ఫ్లాప్స్ అనేవి చాలా సహజం .. సక్సెస్ వచ్చినప్పుడు రెచ్చి పోయి.. డిజాస్టర్స్ వచ్చినప్పుడు కుంగి పోకుండా చాలా మంది నటీనటులు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. తమ టాలెంట్ ను నమ్ముకొని చాలా మంది హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. కానీ ఈ హీరోయిన్ మాత్రం అలా కాదు.

Tollywood : 8 సినిమాలు చేస్తే 7అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.. ఆఫర్స్ లేక ఇప్పుడు ఇలా
Actress
Rajeev Rayala
|

Updated on: May 27, 2025 | 4:28 PM

Share

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది అందాల భామలు కొన్ని సినిమాలేక పరిమితం అవుతున్నారు. అందం, అభినయం ఉన్నప్పటికీ కొంతమంది భామలు నాలుగు ఐదు సినిమాలు చేసి ఆతర్వాత కనిపించకుండా పోతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ సినిమాలు మానేసి పెళ్లి చేసుకొని సెటిల్ అవుతున్నారు. దాంతో అభిమానులు ఈ ముద్దుగుమ్మల కోసం సోషల్ మీడియాలో గాలిస్తున్నారు. ఇప్పుడు ఓ చిన్నదాని కోసం నెటిజన్స్ గూగుల్ లో తెగ గాలిస్తున్నారు. ఇంతకూ ఆ భామ ఎవరో తెలుసా.? తెలుగులో ఈ బ్యూటీ చేసింది ఎనిమిది సినిమాలు కానీ హిట్ అయ్యింది మాత్రం ఒకే ఒక్క సినిమా. అందంలో ఈ అమ్మడు అప్సరస.. కెరీర్ పీక్ లో ఉండగానే సినిమాలకు దూరం అయ్యింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి : అప్పుడు స్టార్ హీరోలు నాకోసం ఎదురుచూసేవారు.. కానీ ఇప్పుడు అవకాశాలు ఇవ్వడంలేదు..

అందం, అభినయం ఉన్నా కూడా సక్సెస్ సాధించలేకపోయింది ఈ బ్యూటీ. హీరోయిన్ గా చేసింది, సెకండ్ హీరోయిన్ గాను చేసింది అయినా కూడా ఆమెకు అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. ఇంతకూ ఆమె ఎవరో కాదు టాలీవుడ్ బాపు బొమ్మ ప్రణీత సుభాష్. తన క్యూట్ లుక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రణీత సుభాష్ కు మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ అమ్మడి అందానికి కుర్రకారు ఫిదా అయ్యారు. ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ అమ్మడు. హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేసి మెప్పించింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అది దా సర్‌ప్రైజ్‌..! ఖలేజా మూవీ దిలావర్ సింగ్ భార్య గుర్తుందా.. ఇప్పుడు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే

హీరోయిన్ గా అనుకున్నంత గుర్తింపు సొంతం చేసుకోలేదు. ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా సినిమాలు చేసింది. అయినా కూడా అంతగా సక్సెస్ సాధించలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది సినిమాతో భారీ హిట్ అందుకుంది. కానీ అంతగా అవకాశాలు రాలేదు. తెలుగులో ఏం పిల్లో ఏం పిల్లడో, బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస, డైనమైట్, హలో గురు ప్రేమకోసమే, బ్రహ్మోత్సవం సినిమాల్లో నటించింది. ఇక కెరీర్ పీక్ లో ఉండగానే.. పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. ఇద్దరు పిల్లలు పుట్టినా కూడా అందంతో కుర్రాళ్లను కవ్విస్తుంది.

ఇది కూడా చదవండి : చిన్నవయసులోనే ప్రేమలో పడింది.. పెళ్లికోసం మతం మార్చుకుంది.. 18ఏళ్లకు దారుణమైన చావు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.