AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sumanth: సుమంత్ వద్దన్నాడు.. తరుణ్ బ్లాక్ బస్టర్ కొట్టాడు.. ఆ మూవీ గురించి ఇప్పటికీ ఫీలవుతోన్న అక్కినేని హీరో

ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ హీరోల్లో ఫీల్ గుడ్ సినిమాలు తీయాలంటే అక్కినేని సుమంత్ ఫస్ట్ ఛాయిస్ అని చెప్పుకోవచ్చు. సత్యం, గోదావరి, గోల్కొండ హైస్కూల్, మళ్లీరావా, లేటెస్ట్ గా అనగనగా.. ఇలా ఎన్నో మంచి సినిమాలతో తెలుగు ఆడియెన్స్ ను మెప్పించాడు సుమంత్.

Sumanth: సుమంత్ వద్దన్నాడు.. తరుణ్ బ్లాక్ బస్టర్ కొట్టాడు.. ఆ మూవీ గురించి ఇప్పటికీ ఫీలవుతోన్న అక్కినేని హీరో
Tarun, Sumanth
Basha Shek
|

Updated on: May 27, 2025 | 5:31 PM

Share

అనగనగా సినిమాతో మరోసారి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు అక్కినేని హీరో సుమంత్. ఇటీవలే ఈటీవీ విన్ ఓటీటీలో డైరెక్టుగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. ఇందులో సుమంత్, కాజల్ చౌదరి ప్రధాన పాత్రలు పోషించారు. పిల్లల చదువు, పెంపకం, తల్లి దండ్రుల బాధ్యత గురించి ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. అందుకే చాలా మంది ఈ సినిమాన ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. లేటెస్ట్ గా ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణ రాజు అనగనగా సినిమాను చూసి ప్రశంసలు కురిపించారు. ఎన్నో సున్నితమైన అంశాలను హృదయానికి హత్తుకునేలా చూపించారంటూ చిత్రబృందాన్ని అభినందించారు. కాగా 1990 లో హీరోగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు సుమంత్. ఈ 25 ఏళ్ల సినిమా కెరీర్ లో సుమారు 30 కు పైగా సినిమాల్లో నటించాడు. అందులో చాలా వరకు ఫీల్ గుడ్ సినిమాలే. అయితే తరుణ్ నటించిన ఓ ఇండస్ట్రీ హిట్ మూవీలో సుమంత్ హీరోగా నటించాల్సిందట.

2000లో వచ్చిన ఆ సినిమా బడ్జెట్ కేవలం కోటి రూపాయలైతే ఏకంగా రూ. 20 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.ఈ సినిమాతో కెరీర్ లో తొలిసారి తరుణ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అప్పటి యువత ఈ సినిమాకు ఫిదా అయిపోయింది. చాలా థియేటర్లలో ఈ మూవీ 250 రోజులకు పైగా ఆడింది. ఒక వేళ ఈ సినిమాలో సుమంత్ నటించి ఉంటే కెరీర్ మరోలా ఉండేదేమో అనిపిస్తోంది. ఇప్పటికే కూడా సుమంత్ పలు సందర్భాల్లో ఈ మూవీ గురించి చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అనగనగా సినిమా ప్రమోషన్లలోనూ మరోసారి ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘నువ్వేకావాలి సినిమా ఆఫర్ నాకు వచ్చింది. కానీ అది నేను మిస్ చేసుకున్నాను. అందుకు ఫీల్ అయ్యాను. నా మొత్తం సినీ కెరీర్ లో నా వద్దకు వచ్చి చేయలేకపోయిన సినిమా నువ్వే కావాలి ఒక్కటే. నా కెరీర్ మొదట్లోనే స్రవంతి రవికిషోర్ నాకు నువ్వే కావాలి ఆఫర్ ఇచ్చారు. కానీ డేట్స్ కారణంగా చేయలేకపోయాను. ఆ సమయంలో రాఘవేంద్ర రావు మూవీతో పాటు యువకుడు సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నాను.

ఇవి కూడా చదవండి

ఇవాళ్టి నుంచి థియేటర్లలో అనగనగా సినిమా..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..