AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kannappa Movie: కన్నప్ప సినిమాలో ప్రభాస్‌ ఎంతసేపు కనిపిస్తారంటే? ఆసక్తికర విషయాలు చెప్పిన మంచు విష్ణు

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ చిత్రంలో విష్ణుతో పాటు ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్ తదితర స్టార్లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా వైడ్ ఈ మూవీ రిలీజ్ కానుంది.

Kannappa Movie: కన్నప్ప సినిమాలో ప్రభాస్‌ ఎంతసేపు కనిపిస్తారంటే? ఆసక్తికర విషయాలు చెప్పిన మంచు విష్ణు
Kannappa Movie
Basha Shek
|

Updated on: May 26, 2025 | 5:45 PM

Share

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ‘కన్నప్ప’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా ఎట్టకేలకు జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో విష్ణు మంచుతో పాటు, ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్, ఐశ్వర్య రాజేష్, శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల, ముఖేష్ రిషి, కరుణాస్, యోగి బాబు, సప్తగిరి, రఘు బాబు, , దేవరాజ్, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా (విష్ణు కూతుళ్లు) ఇలా ఎందరో స్టారాది స్టార్స్ ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు. తెలుగుతో పాటు హిందీ, మలయాళం, కన్నడ, తమిళ్.. ఇలా పలు ప్రాంతీయ భాషల్లో కన్నప్ప సినిమా రిలీజ్ కానుంది. కాగా ఇంతలో, ‘ కన్నప్ప ‘ సినిమా నిడివి ఎంత అనేది వెల్లడైంది. ఈ సినిమా నిడివి సుమారు 3 గంటల 10 నిమిషాలని తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్టులో ప్రభాస్ రుద్రుడిగా కనిపించనున్నాడు. మూడు గంటలకు పైగా నిడివి గల ఈ చిత్రంలో ప్రభాస్ సుమారు 30 నిమిషాలు కనిపిస్తారు. విష్ణు, మోహన్ బాబులతో అతని కాంబినేషన్ సీన్స్ ఉంటాయట.

ఇక కన్నప్ప సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పాత్ర కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉండనుందట. అయితే ఈ రోల్ సినిమాలో చాలా కీలకం కానుందట. వీరితో పాటు అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో, కాజల్ అగర్వాల్ పార్వతి పాత్రలో కనిపించనున్నారు. వీరిద్దరూ 10 నిమిషాలు స్క్రీన్‌పై కనిపించనున్నారని టాక్.

ఇవి కూడా చదవండి

కన్నప్ప సినిమాలో మోహన్ లాల్..

‘కన్నప్ప’ చిత్రంలోని తదుపరి పాట మే 28న కాల శ్రీకాళహస్తిలో విడుదల కానుంది. ఈ పాటను విష్ణు మంచు కుమార్తెలు అరియానా, వివియానా పాడారు. ఈ చిత్రానికి స్టీఫెన్ దేవాసి సంగీతం సమకూర్చారు. ముఖేష్ కుమార్ సింగ్ ‘కన్నప్ప’ చిత్రానికి దర్శకత్వం వహించారు. మోహన్ బాబు మహాదేవ శాస్త్రి అనే పాత్రను పోషిస్తున్నారు. సుమారు రూ. 200 కోట్లకు పైగా బడ్జెట్ తో కన్నప్ప సినిమా తెరకెక్కుతోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..