- Telugu News Photo Gallery Cinema photos Tollywood Senior Actress Laya Celebrates Her Mother Birthday, See Photos
Actress Laya: అమ్మకు ప్రేమతో.. తల్లి పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన లయ.. ఫొటోస్ చూశారా?
హీరోయిన్ లయ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అప్పట్లో ఓ వెలుగు వెలిగిన ఈ అందాల తార మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. నితిన్ హీరోగా నటిస్తోన్న తమ్ముడు సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది లయ.
Updated on: May 26, 2025 | 7:51 AM

టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హోమ్లీ హీరోయిన్స్ లో లయ ఒకరు. తన అందం, అభినయంతో తెలుగు వారికి బాగా దగ్గరైందీ అందాల తార.

అయితే హీరోయిన్‌గా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయిపోయింది లయ. 2006లో అమెరికాకు చెందిన డాక్టర్ శ్రీ గణేశన్ ను వివాహం చేసుకుందీ అందాల తార.

పెళ్లి తర్వాత భర్తతో కలిసి అమెరికాకు వెళ్లిన లయ అక్కడే సెటిల్ అయ్యింది ప్రస్తుతం ఈ దంపతులకు ఒక పాప, ఒక బాబు ఉన్నారు.

కాగా ఇప్పుడు పిల్లలు పెరిగి పెద్దవారు కావడంతో సినిమాల్లో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది లయ. నితిన్ హీరోగా నటిస్తోన్న తమ్ముడు సినిమాలో ఆమె ఓ కీలక పాత్ర పోషిస్తోంది.

సినిమాల సంగతి పక్కన పెడితే.. తాజాగా తన తల్లి పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది లయ. తన స్నేహితులు, సన్నిహితులను పిలిచి వారందరి మధ్య తన తల్లితో కేక్ కట్ చేయించింది.

తన తల్లి బర్త్ డే ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది లయ. ఈ ఫొటోలకు 'హ్యాపీ బర్త్ డే అమ్మా! లవ్యూ సో మచ్' అని క్యాప్షన్ తో అమ్మపై తనకున్నప్రేమను చాటుకుంది.




