AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Director Maniratnam: నవీన్ పొలిశెట్టితో పాన్ ఇండియా మూవీ.. మణిరత్నం ఏమన్నారంటే..

భారతీయ సినీరంగంలో డైరెక్టర్ మణిరత్నం సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. విభిన్నమైన కథలను మరింత అందంగా, అద్భుతంగా మార్చి వెండితెరపైకి తీసుకువస్తుంటారు. రోజా, బొంబాయి, దిల్ సే, నాయకన్, అమృత వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. ప్రస్తుతం థగ్ లైఫ్ మూవీని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.

Director Maniratnam: నవీన్ పొలిశెట్టితో పాన్ ఇండియా మూవీ.. మణిరత్నం ఏమన్నారంటే..
Naveen Polishetty, Maniratn
Rajitha Chanti
|

Updated on: May 27, 2025 | 7:31 AM

Share

డైరెక్టర్ మణిరత్నం సినిమాలకు సినీరంగంలో ప్రత్యేకమైన ఇమేజ్ ఉంటుంది. తమిళం, తెలుగుల, హిందీ భాషలలో ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించారు. ముఖ్యంగా తమిళంలో అనేక హిట్ చిత్రాలను అందించారు. ఇప్పటికీ మణిరత్నం సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేసే అభిమానులు ఉన్నారు. రోజా, బొంబాయి వంటి చిత్రాల నుంచి..పొన్నియన్ సెల్వన్ సినిమాల వరకు ఆయన తెరకెక్కించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం మణిరత్నం రూపొందిస్తున్న సినిమా థగ్ లైఫ్. లోకనాయకుడు కమల్ హాసన్, త్రిష, శింబు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా జూన్ 5న అడియన్స్ ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ మరింత ఆసక్తిని క్రియేట్ చేసింది. కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మణిరత్నం.

డైరెక్టర్ మణిరత్నం తెలుగు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో ఓ సినిమా చేయబోతున్నారని కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి కాంబోలో పాన్ ఇండియా ఫిల్మ్ రానుందని.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందనే టాక్ సైతం నడుస్తోంది. ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి సరసన కన్నడ భామ రుక్మిణీ వసంత్ కథానాయికగా నటిస్తుందని సమాచారం. ఈ క్రమంలో తాజాగా థగ్ లైఫ్ మూవీ ప్రమోషన్లలో అసలు విషయం బయటపెట్టారు మణిరత్నం. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మణిరత్నం ఈ రూమర్స్ పై స్పందిస్తూ.. తన వరకు అవి కేవలం వార్తలు మాత్రమే అని.. ప్రస్తుతం తాను కొన్ని స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నానని.. ఏది ముందుగా తెరపైకి వస్తుందో తెలియదన్నారు. దీంతో మణిరత్నం, నవీన్ పొలిశెట్టి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చేసింది.

అలాగే త్రిష, కమల్ హాసన్ మధ్య వచ్చే సన్నిహిత సన్నివేశాలపై మణిరత్నం స్పందించారు. సినిమాకు సంబంధించి అందులోని పాత్రలను చూడాలి గానీ.. కమల్ హాసన్, త్రిషలను చూడకూడదన్నారు. నిజ జీవితంలో ఏజ్ గ్యాప్ ఉన్న చాలా మంది రిలేష్ షిప్ లో ఉంటున్నారు. అది ఎప్పటినుంచే ఉన్నదే.. అయితే సినిమా విషయంలో మాత్రం కొందరు తప్పులు వెతకాలని ప్రయత్నిస్తుంటారని అన్నారు. నవీన్ పొలిశెట్టి.. తెలుగులో కేవలం ఒక్క సినిమాతోనే పాపులర్ అయ్యారు. డైరెక్టర్ అనుదీప్ కె.వి తెరకెక్కించిన జాతిరత్నాలు సినిమాతో స్టార్ డమ్ సంపాదించుకున్నారు. అంతకు ముందు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు నవీన్. ప్రస్తుతం అనగనగా ఒక రాజు అనే సినిమాలో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :  

Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..

Megastar Chiranjeevi: అమ్మ బాబోయ్.. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్‏ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‏స్టాప్ సస్పెన్స్..

Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..