AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Orange Movie: ప్రియుడితో పెళ్లిపీటలెక్కనున్న ఆరెంజ్ హీరోయిన్.. ఇప్పుడెలా ఉందో చూశారా? లేటెస్ట్ ఫొటోస్ వైరల్

షాజన్ పదంసీ.. ఈ పేరు వింటే చాలామందికి గుర్తు రాకపోవచ్చు. కానీ రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమాలో రూబా అంటే కళ్ల ముందు ఓ అందమైన రూపం మెదులుతుంది. ఆరెంజ్ తో పాటు పలు తెలుగు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ త్వరలో పెళ్లిపీటలెక్కనుంది.

Orange Movie: ప్రియుడితో పెళ్లిపీటలెక్కనున్న ఆరెంజ్ హీరోయిన్.. ఇప్పుడెలా ఉందో చూశారా? లేటెస్ట్ ఫొటోస్ వైరల్
Orange Movie
Basha Shek
|

Updated on: May 26, 2025 | 4:57 PM

Share

థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా కల్ట్ క్లాసిక్ గా నిలిచిన సినిమాల్లో ఆరెంజ్ సినిమా ఒకటి. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీలో రామ్ చరణ్, జెనీలియా హీరో, హీరోయిన్లుగా నటించారు. అలాగే మరో హీరోయిన్ గా షాజన్ పదంసీ నటించింది. సినిమాల్లో బాగా హైలెట్ గా నిలిచిన పాత్రల్లో షాజన్ ది కూడా ఒకటి. ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ ప్రియురాలు రూబాగా అద్భుతంగా నటించిందీ అందాల తార. తన క్యూట్ లుక్స్ తో కుర్రకారును ఆకట్టుకుంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ రాకెట్‌ సింగ్‌: సేల్స్‌మ్యాన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ సినిమాతో చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత కనిమొళి అనే తమిళ చిత్రంలో నటించింది. దిల్‌ తో బచ్చా హై జీ, హౌస్‌ఫుల్‌ 2 వంటి హిందీ సినిమాల్లోనూ మెరిసింది. ఆరెంజ్‌ సినిమాతో టాలీవుడ్ ఆడియెన్స్ కు పరిచయమైంది. ఆ తర్వాత రామ్ పోతినేని, విక్టరీ వెంకటేశ్ హీరోలుగా నటించిన మసాలా సినిమాలోనూ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. అయితే ఆ తర్వాత క్రమంగా ఇండస్ట్రీకి దూరమైందీ ముద్దుగుమ్మ.

2015లో సాలిడ్‌ పటేల్స్‌ (హిందీ) సినిమాలో నటించిన షాజన్ దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత 2023లో పాగల్‌పన్‌: నెక్స్ట్‌ లెవల్‌ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. దీంతో పాటు కొన్ని వెబ్ సిరీసుల్లోనూ ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

కాబోయే భర్తతో ఆరెంజ్ హీరోయిన్..

కాగా సినిమాల్లో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన షాజన్ పదంసీ త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. తన ప్రియుడు, వ్యాపార వేత్త ఆశిష్‌ కనకియాతో ఆమె వివాహం జరగనుంది. గతేడాది నవంబర్‌లోనూ అశీష్‌ తనకు ప్రపోజ్ చేసినట్లు షాజన్ తెలిపింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరిలో వీరి రోకా వేడుక అట్టహాసంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలయ్యాయి. కాగా  జూన్‌లో వీరి పెళ్లి వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది.

షాజన్ పదంసీ రోకా వేడుక ఫొటోస్..

ఆరెంజ్ హీరోయిన్ లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .

Follow Us
స్వచ్ఛమైన బంగారం లాంటి ఈ విత్తనాలు రోజుకు ఒక చెంచా తింటే చాలు..
స్వచ్ఛమైన బంగారం లాంటి ఈ విత్తనాలు రోజుకు ఒక చెంచా తింటే చాలు..
ప్రపంచంతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి
ప్రపంచంతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి
తిరుమలలో బిగ్ క్యాంటీన్లు.. భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం
తిరుమలలో బిగ్ క్యాంటీన్లు.. భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం
ఆ 4 బ్రేక్‌ఫాస్ట్‌లు వదిలేయండి.. జస్ట్ ఈ 4 తినండి
ఆ 4 బ్రేక్‌ఫాస్ట్‌లు వదిలేయండి.. జస్ట్ ఈ 4 తినండి
రోజంతా ఫ్యాన్ వాడితే నెలకు ఎంత కరెంట్ బిల్ వస్తుందో తెలుసా?
రోజంతా ఫ్యాన్ వాడితే నెలకు ఎంత కరెంట్ బిల్ వస్తుందో తెలుసా?
విషాన్ని దొంగిలించే విచిత్ర పాము.. దీన్ని మెడ వెనక రహస్యం
విషాన్ని దొంగిలించే విచిత్ర పాము.. దీన్ని మెడ వెనక రహస్యం
ఆడంబరాల కంటే ఆధ్యాత్మికతే మిన్న..భగవద్గీతలోనే వివాహ శుభలేఖ!
ఆడంబరాల కంటే ఆధ్యాత్మికతే మిన్న..భగవద్గీతలోనే వివాహ శుభలేఖ!
మీ PF క్లెయిమ్‌ రిజెక్ట్‌ కావొద్దంటే ఇలా చేయండి!
మీ PF క్లెయిమ్‌ రిజెక్ట్‌ కావొద్దంటే ఇలా చేయండి!
శిఖర్ ధావన్, మహానార్యమన్ సింధియా సమక్షంలో ఎంపీఎల్ ఉమెన్ డ్రాఫ్ట్!
శిఖర్ ధావన్, మహానార్యమన్ సింధియా సమక్షంలో ఎంపీఎల్ ఉమెన్ డ్రాఫ్ట్!
అయ్యో.. ఎంత ఘోరం.. ట్యాంకర్ చక్రాల కింద పడి నలిగిన యువకుడు..
అయ్యో.. ఎంత ఘోరం.. ట్యాంకర్ చక్రాల కింద పడి నలిగిన యువకుడు..