AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Vishnu: నా జీవితంలో ప్రభాస్‌ కృష్ణుడు.. తన వెనకే నేను కర్ణుడిలా.. మంచు విష్ణు కామెంట్స్..

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. భారీ అంచనాల మధ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం రాత్రి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్.

Manchu Vishnu: నా జీవితంలో ప్రభాస్‌ కృష్ణుడు.. తన వెనకే నేను కర్ణుడిలా.. మంచు విష్ణు కామెంట్స్..
Manchu Vishnu, Prabhas
Rajitha Chanti
|

Updated on: Jun 22, 2025 | 6:47 AM

Share

శివానుగ్రహంతోనే కన్నప్ప సినిమా తెరకెక్కిందని అన్నారు హీరో మంచు విష్ణు. ఆయన ప్రధాన పాత్రలో రూపొందిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, శరత్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ హిస్టారికల్ ఎపిక్ సినిమాను జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా కన్నప్ప ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్రయూనిట్. ఇదివరకు విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. దీంతో ఈనెలలో రిలీజ్ అయ్యే కన్నప్ప మూవీపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం హైదరాబాద్ కన్పప్ప మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. ఆ సినిమాను ఎంతో బాధ్యతతో, క్రమశిక్షణతో ఒక మంచి చిత్రాన్ని తీశామని అన్నారు.

మంచు విష్ణు మాట్లాడుతూ.. “శివానుగ్రహం ఉంటే ఏదైనా జరుగుతుందని నమ్ముతాను. ఇది విష్ము సినిమా కాదు.. కన్నప్ప సినిమా. ఇంత పెద్ద సినిమా మేం చేశామా.. ? ఇందులో నేను నటించానా ? అని ఆశ్చర్యం కలుగుతుంది. చెప్పుకోలేని ఎన్నో బాధలు ఈ సినిమా వెనక ఉన్నాయి. అంత సులభంగా ఈ మూవీ జరగలేదు. శివరాజ్ కుమార్ మాట్లాడుతూ… ఈ సినిమా చేయాలని ఎందుకనిపించింది అని అడిగారు. ఈ తరానికి కన్నప్ప గురించి, వాయులింగం గురించి, శ్రీకాళహస్తి గురించి చెప్పమని శివుడి ఆదేశించాడని చెప్పాను. స్నేహితుల్లో కృష్ణుడు, కర్ణుడిలా రెండు రకాలు ఉంటారు. నా జీవితంలో ప్రభాస్ కృష్ణుడు. తన జీవితంలో కర్ణుడిలా ఎప్పుడు ఏం చేసినా వెనకే ఉంటాను. ఆయన ఈ సినిమా చేయాల్సిన అవసరం లేదు. నాన్నపై ఉన్న ప్రేమ, అభిమానం, గౌరవంతో ఒప్పుకున్నాడు. ప్రభాస్ ప్రపంచంలోనే ఓ పెద్ద స్టార్ హీరో. కానీ మేమిద్దరం మొదటి రోజు ఎలా కలిశామో.. ఇప్పటికీ అలాగే ఉన్నాము” అంటూ చెప్పుకొచ్చారు.

అలాగే జూన్ 27న విడుదలయ్యే కన్నప్ప సినిమాను అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు. ఈ సినిమాలో తిన్నడు పాత్రలో ముంచు విష్ణు నటిస్తుండగా.. రుద్ర పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు. అలాగే శివపార్వతులుగా అక్షయ్ కుమార్, కాజల్ నటించారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి :  

వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..

సీరియల్లో పద్దతిగా.. వెకేషన్‏లో గ్లామర్‏గా.. రుద్రాణి అత్త అరాచకమే..

త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..

Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్