Adipurush-Manchu Vishnu: ఆదిపురుష్ టీజర్ గురించి నేను అలా అనలేదు.. వివరణ ఇచ్చిన మంచు విష్ణు..

రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ చిత్రాన్ని 3డీ చిత్రంగా తీసుకువస్తున్నారు. ఇందులో ప్రభాస్ రాముడిగా.. కృతి సనన్ సీతగా ... బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించనున్నారు.

Adipurush-Manchu Vishnu: ఆదిపురుష్ టీజర్ గురించి నేను అలా అనలేదు.. వివరణ ఇచ్చిన మంచు విష్ణు..
Machu Vishnu, Adipurush Tea
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 15, 2022 | 12:10 PM

బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న చిత్రం ఆదిపురుష్. అయితే ఎన్నో అంచనాలతో ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు టీజర్‏తో నిరాశపరిచారు మేకర్స్. ఇందులో ప్రభాస్ లుక్స్.. యానిమేషన్ ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది. దీంతో టీజర్ పై దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. అంతేకాకుండా హనుమంతుడు.. రావణుడు.. రాముడు లుక్స్.. వేషధారణపై విమర్శలు రావడమే కాకుండా ఏకంగా ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో ప్రభాస్‏తోపాటు చిత్రయూనిట్ మొత్తానికి నోటీసులు జారీ చేసింది కోర్టు. అయితే టీజర్ డైరెక్టర్ ఓంరౌత్ వివరణ ఇచ్చినప్పటికీ ట్రోల్స్ మాత్రం తగ్గడం లేదు. తాజాగా టాలీవుడ్ హీరో మంచు విష్ణు సైతం ఆదిపురుష్ టీజర్ పై స్పందించారని.. ఆయన ప్రస్తుతం నటిస్తోన్న జిన్నా సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీజర్ పై ఆసక్తికర కామెంట్స్ చేసినట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

” లైవ్ యాక్షన్ చిత్రంగా రామాయణాన్ని తెరకెక్కిస్తున్నారని.. ఇది మెయిన్ స్ట్రీమ్ లైవ్ యాక్షన్ సినిమా అవుతుందని అనుకున్నాము. కానీ ఇది యానిమేషన్ సినిమా అవుతుందని ఊహించలేదు. అందుకే ప్రేక్షకులు నిరుత్సాహానికి గురయ్యారు. ముందే ఇది యానిమేషన్ సినిమా అని చెప్పి ఉంటే.. టీజర్ పై ఇంతగా ట్రోల్స్ వచ్చేవి కాదు. ప్రేక్షకులను మోసం చేస్తే ఇలాంటి రియాక్షన్సే వస్తాయి. టీజర్ చూసి నేను కూడా మోసపోయాను. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నుంచి రామాయణం వస్తుందని.. అందులోనూ తాన్హాజీ డైరెక్టర్ దీన్ని తెరకెక్కిస్తున్నారంటే ఈ సినిమాను భారీగానే ఊహించుకున్నాను. అందుకే ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. అలాంటి సమయంలో యానిమేటెడ్ వీడియోను రిలీజ్ చేస్తే ఇలాంటి స్పందనలే వస్తాయి.” అంటూ మంచు విష్ణు చెప్పినట్లుగా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

ఇవి కూడా చదవండి

తాజాగా ఈ తన గురించి వస్తున్న వార్తలపై మంచు విష్ణు స్పందించారు. ఆదిపురుష్ టీజర్ పై తాను మాట్లాడినట్లు వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశఆరు. ఫేక్ న్యూస్.. నేను ఊహించిన విధంగానే జిన్నా మూవీ విడుదలకు ముందు కొంతమంది కావాలనే ఇలాంటి నెగిటివ్ వార్తలను ప్రచారం చేస్తున్నారు. నా డార్లింగ్ ప్రభాస్ కు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా.. అంతకు మించు నాకేమి వద్దు అంటూ ట్వీట్ చేశారు.

రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ చిత్రాన్ని 3డీ చిత్రంగా తీసుకువస్తున్నారు. ఇందులో ప్రభాస్ రాముడిగా.. కృతి సనన్ సీతగా … బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించనున్నారు. భారీ బడ్జెట్‍తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.