Megastar Chiranjeevi: మెగా అభిమానులకు డైరెక్టర్ బిగ్ సర్‏ప్రైజ్.. టీజర్‏తోనే అంచనాలు పెంచేస్తాడట..

డైరెక్టర్ బాబీ రూపొందిస్తున్న మెగా 154 సినిమా డబ్బింగ్ పనులు షూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్ దీపావళీ కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా చిరు స్వయంగా ప్రకటించారు.

Megastar Chiranjeevi: మెగా అభిమానులకు డైరెక్టర్ బిగ్ సర్‏ప్రైజ్.. టీజర్‏తోనే అంచనాలు పెంచేస్తాడట..
Mega 154 Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 15, 2022 | 10:38 AM

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. ఓ వైపు గాడ్ ఫాదర్ సక్సెస్‏ఫుల్‏గా దూసుకుపోతుండగా… మరోవైపు తన తదుపరి చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు చిరు చేతిలో భోళా శంకర్, మెగా 154 చిత్రాలున్నాయి. ఈ రెండు సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. అయితే తాజాగా డైరెక్టర్ బాబీ రూపొందిస్తున్న మెగా 154 సినిమా డబ్బింగ్ పనులు షూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్ దీపావళీ కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా చిరు స్వయంగా ప్రకటించారు. ఇక తాజాగా డైరెక్టర్ బాబీ తన ట్వీట్‏తో మెగా అభిమానుల అంచనాలను మరింత పెంచేశారు.

ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్..టీజర్‏కు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పూర్తిచేశానంటూ ట్వీట్ చేయగా.. అందుకు బాబీ స్పందిస్తూ.. డీఎస్పీ టీజర్‏ను నెక్స్ట్ లెవల్ తీసుకువెళ్తారని.. ఆ విషయంలో చిత్రబృందానికి పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. అయితే చిరు, దేవి శ్రీ కాంబోలో వచ్చిన చిత్రాలు మ్యూజిక్ పరంగా ఇప్పటికే సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి వీరి కాంబోలో రాబోతున్న సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఒక యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ ఈ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా కమర్షియల్ బొనాంజా అందించడానికి మెగా మాస్ పూనకాలు తెప్పించేలా మెగా154′ రూపుదిద్దుకుంటుంది. దీపావళి కానుకగా టైటిల్ టీజర్ విడుదల కానుంది. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ కన్ఫార్మ్ చేసినట్లుగా తెలుస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.