AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Poonam Kaur: ఆ ఫోటో చూసి పెళ్లి అయ్యిందా అంటూ నెటిజన్స్ కామెంట్స్.. పూనమ్ ఆన్సర్ ఇదే

కర్వాచౌత్‌ పండుగ సందర్భంగా పూనమ్ కౌర్ షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె పెళ్లి చేసుకోబోతుందా అన్న ప్రశ్నలు తలెత్తాయి.

Poonam Kaur: ఆ ఫోటో చూసి పెళ్లి అయ్యిందా అంటూ నెటిజన్స్ కామెంట్స్..  పూనమ్ ఆన్సర్ ఇదే
Poonam Kaur
Ram Naramaneni
|

Updated on: Oct 15, 2022 | 11:00 AM

Share

కర్వాచౌత్‌  ఫెస్టివల్ గురించి మన దగ్గర చాలామందికి తెలిసి ఉండదు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. భర్తకు విజయాలు చేకూరాలని.. దీర్ఘాయుష్షును ఉండాలని పెళ్లైన మహిళలు పార్వతీదేవికి ఈ పండుగ రోజున మొక్కులు చెల్లించుకుంటారు. రోజంతా ఉపవాసం ఉండి.. భక్తిశ్రద్దలతో అమ్మను వేడుకుంటారు. జల్లెడ నుంచి చంద్రబింబాన్ని చూసి.. ఆపై భర్త ముఖాన్ని చూడటం ఈ పండగలో హైలెట్ పార్ట్. పెళ్లి కుదిరినవారు, ప్రేమలో ఉన్నవారు సైతం.. తమకు కాబోయే భాగస్వాములతో కలిసి ఈ పూజలు చేస్తారు. భలేగా అనిపిస్తుంది కదా..!. అయితే ఈ పండగను ఓ తెలుగు సినిమా హీరోయిన్ జరపుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

పూనమ్‌కౌర్‌‌ను తెలుగు జనాలకు స్పెషల్‌గా పరిచయం చేయాల్సిన పనిలేదు. తక్కువ సినిమాలే చేసినప్పటికీ.. వివాదాస్పద ట్వీట్లతో ఎక్కువ ప్రాచుర్యాన్ని సంపాదించుకుంది. మంచి నటి.. కానీ.. అవకాశాలు అకస్మాత్తుగా తగ్గిపోయాయి. ఇప్పుడు అడపా దడపా సపోర్టింగ్ రోల్స్‌లో కనిపిస్తుంది. తాజాగా ఇప్పుడు ఆమె షేర్ చేసిన ఓ ఫోటో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంది. తన ఫ్యాన్స్‌కు, నెటిజన్లకు కర్వాచౌత్‌ విషెస్ చెబుతూ ఈ గురువారం నైట్ ఓ ఫోటో షేర్ చేసింది పూనమ్. ఇందులో ఆమె జల్లెడ చేతబట్టి.. చంద్రబింబాన్ని చూస్తూ.. చందమామ మాదిరిగా కనిపిస్తుంది.  అయితే ఈ ఫోటో చూడగానే నెటిజన్లకు కొన్ని డౌట్స్ కూడా వచ్చాయి. ఇది మ్యారేజ్ అయినవాళ్లు చేసుకునే ఫెస్టివల్ కదా..? మీకు కూడా పెళ్లి అయ్యిందా..? చంద్రబింబాన్ని చూసిన తర్వాత మీరు ఎవరి ముఖాన్ని చూశారు అంటూ తెగ కామెంట్స్ పెడుతున్నారు.

కాగా నెటిజన్ల కామెంట్లపై కాస్త ఘాటు రిప్లై ఇచ్చింది పూనమ్. ఈ ఆర్టికల్స్ రాజకీయంగా ప్రేరేపించబడ్డాయో లేక మిషనరీల ఆలోచనా విధానంతో సంధించబడ్డాయో తనకు తెలియదన్నారు. కర్వాచౌత్‌ పండుగను.. పెళ్లి కాని అమ్మాయిలు తమ కాబోయే భర్తల కోసం జరుపుకుంటారని తెలిపారు. కాకపోతే పెళ్లికాని అమ్మాయిలు చంద్రునికి బదులుగా.. చుక్కలను ఆరాధిస్తారని ఆమె వివరించింది. 

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.