Actor Ajay: ‘డబ్బులు లేక హోటల్లో గిన్నెలు కడిగాను.. సినిమాల్లో కనిపించకపోవడానికి కారణమేంటంటే’.. నటుడు అజయ్ కామెంట్స్..
చాలా కాలం తర్వాత ఇటీవల 9 అవర్స్ అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ ద్వారా సినీప్రియులను అలరించారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి.. తాను ఇన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండడం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
పవర్ఫుల్ విలన్‌గా.. సహాయ నటుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు అజయ్. స్నేహితుడిగా.. అన్నయ్య.. ప్రతినాయకుడిగా ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 22 ఏళ్లుగా ఇండస్ట్రీలోకి రాణిస్తున్న అజయ్.. హీరోలతో సమానంగా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. విక్రమార్కుడు.. ఒక్కడు.. సై.. దేశముదురు.. ఇష్క్.. వంటి అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. అయితే గత కొద్దికాలంగా అజయ్ వెండితెరపై కనిపించడం లేదు. అయితే చేతినిండా సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే అజయ్.. కొద్దిరోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అలాగే ఎక్కడా ఈవెంట్స్‌లోనూ అజయ్ కనిపించలేదు. చాలా కాలం తర్వాత ఇటీవల 9 అవర్స్ అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ ద్వారా సినీప్రియులను అలరించారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి.. తాను ఇన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండడం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
అజయ్ మాట్లాడుతూ.. ” నేనెప్పుడూ పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే నటించాను. గత 22 సంవత్సరాలుగా చేసింది కూడా అదే. ఇక తర్వాత రోజుల్లోనూ అదే చేస్తాను. సినిమాలో మన పాత్ర ఎంతసేపు ఉంది.. ఎన్నిసార్లు కనిపించింది అని కాకుండా.. ఎంత ప్రభావంతంగా ఉందనేది పరిగణలోకి తీసుకుంటాను. ఇక ఇన్నాళ్లు ఎందుకు సినిమాలకు గ్యాప్ వచ్చిందంటే.. నాకు తగిన పాత్రలు దొరకలేదు. అందుకే మధ్యలో గ్యాప్ తీసుకున్నాను. నేను 19 ఏళ్ల వయసులో ఇంట్లోంచి పారిపోయి నేపాల్ వెళ్లాను.. అక్కడి నుంచి తిరిగి వచ్చేందుకు నా దగ్గర డబ్బులు లేవు. దీంతో హోటల్లో గిన్నెలు కడిగి డబ్బులు వచ్చాక ఇంటికి వచ్చాను.”అంటూ చెప్పుకొచ్చాడు.
అలాగే తన సినిమాల్లోని విలన్ రోల్స్. రేప్ సీన్స్ గురించి చెబుతూ.. ” శ్రీమహాలక్ష్మి సినిమా సమయంలో ఓ ఘటన జరిగింది. ఒక మోడల్ ను రేప్ సీన్ అని చెప్పకుండా తీసుకువచ్చారు. నేను వెళ్లి చేయిపట్టుకోగానే ఆమె గట్టిగా ఏడవడం ప్రారంభించింది. దీంతో నేను ఈ సీన్ చేయలేను అని చెప్పేశాను. అందరిముందు రేప్ సీన్ చేయడం చాలా చిరాకుగా ఉంటుంది. ఈ సినిమా తర్వాత నాకు మళ్లీ అలాంటి సీన్స్ చేసే అవసరం రాలేదు. ఆ విషయంలో చాలా సంతోషిస్తాను “అంటూ చెప్పుకొచ్చాడు.