Manchu Vishnu: నా మనసుకు దగ్గరయిన సినిమా.. జిన్నా ప్రీరిలీజ్ ఈవెంట్‏లో విష్ణు కామెంట్స్..

దీపావళి సందర్భంగా జిన్నా మూవీని అక్టోబర్ 21న వరల్డ్ వైడ్‌గా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఆదివారం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘ‌నంగా జ‌రిగింది. క‌లెక్ష‌న్ కింగ్, న‌ట ప్ర‌పూర్ణ డాక్ట‌ర్ మంచు మోహ‌న్ బాబు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

Manchu Vishnu: నా మనసుకు దగ్గరయిన సినిమా.. జిన్నా ప్రీరిలీజ్ ఈవెంట్‏లో విష్ణు కామెంట్స్..
Manchu Vishnu
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 17, 2022 | 8:25 PM

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘జిన్నా’. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేను స్టార్ రైటర్ కోన వెంకట్ అందించారు.పాయ‌ల్ రాజ్‌పుత్‌, స‌న్నీలియోన్ హీరోయిన్స్‌. దీపావళి సందర్భంగా జిన్నా మూవీని అక్టోబర్ 21న వరల్డ్ వైడ్‌గా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఆదివారం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘ‌నంగా జ‌రిగింది. క‌లెక్ష‌న్ కింగ్, న‌ట ప్ర‌పూర్ణ డాక్ట‌ర్ మంచు మోహ‌న్ బాబు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. జిన్నా’ చిత్రం ఢీ కంటే 10 రెట్లు ఎక్కువ విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

అలాగే విష్ణు మాట్లాడుతూ.. ‘‘జిన్నా సినిమా విషయంలో నేను ముందుగా కోన వెంక‌ట్‌గారికి థాంక్స్ చెప్పాలి. ఆయ‌న వ‌ల్లే ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది. త‌ర్వాత ఛోటాగారికి థాంక్స్ చెప్పాలి. ఆయ‌నతో ఎప్ప‌టి నుంచి ప‌ని చేయాల‌ని అనుకుంటుంటే ఈ సినిమాకు కుదిరింది. అనూప్‌కి స్పెష‌ల్ థాంక్స్‌. జిన్నా నా మ‌న‌సుకు ఎంతో ద‌గ్గ‌ర‌గా ఉండే సినిమా. నా కెరీర్‌లోనే బెస్ట్ మ్యూజిక్‌ని ఈ సినిమాకు ఇచ్చావ్‌. నా హార్ట్ బీట్స్ అయిన ఆరియానా, వివియానా ఈ సినిమాలో తొలిసారి పాట పాడారు. ఆ అవకాశం ఇచ్చినందుకు అనూప్‌కి థాంక్స్‌.

నా మిత్రుడు, బ్ర‌ద‌ర్ అయిన ప్రేమ్ ర‌క్షిత్‌కి థాంక్స్‌. ఆయ‌న షూటింగ్‌లో ఉండి రాలేక‌పోయాడు. త‌నే ఈ సినిమాకు కాన్సెప్ట్ విజువ‌లైజేష‌న్ ఇచ్చారు. ప్ర‌తీ ఒక్కరికి పేరు పేరునా థాంక్స్‌. దివి చాలా ఇంపార్టెంట్ రోల్ చేసింది. అడిగిన వెంట‌నే ఒప్పుకున్నందుకు త‌న‌కు థాంక్స్‌. మా కంపెనీలోనే అవిడ్ అసిస్టెంట్‌గా ఉన్న ఛోటా కె ప్ర‌సాద్ ..ఈరోజు ఎడిట‌ర్ అయ్యారు. త‌న టాలెంటే ఇన్‌స్పిరేష‌న్‌. జారు మిఠాయి సాంగ్ ఇచ్చిన ఈశ్వ‌ర్ రెడ్డిగారికి థాంక్స్‌. నాగేశ్వ‌ర్ రెడ్డి స‌హా అంద‌రికీ థాంక్స్‌. చంద్ర , వెన్నెల కిషోర్ మంచి మార్కులు కొట్టేశారు. డైరెక్ట‌ర్ సూర్య‌కు థాంక్స్‌. 21న రిలీజ్ అవుతున్న ఈ సినిమాను ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏడాది చివర్లో ముఖేష్ అంబానీకి బ్యాడ్ న్యూస్.. ఏంటో తెలుసా?

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు..

ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్

'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?

ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

బుర్జ్ ఖలీఫాలో సెప్టిక్ ట్యాంకులు లేవు.. మానవ వ్యర్థాల పరిస్థితి?
బుర్జ్ ఖలీఫాలో సెప్టిక్ ట్యాంకులు లేవు.. మానవ వ్యర్థాల పరిస్థితి?
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!

3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..

ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో

బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్

అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్