Prabhas: ‘ప్రభాస్.. ఎన్టీఆర్ స్నేహం గురించి చెప్పేందుకు ఆరోజు జరిగిన సంఘటన చాలు’.. డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్..

డైరెక్టర్ మెహర్ రమేష్ మాట్లాడుతూ.. డార్లింగ్.. తారక్ మధ్య ఉన్న స్నేహం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. వీరు ఎంత బెస్టో తాజాగా ఆయన విత్ సీన్‌ తో చెప్పారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు నెట్టింట తెగ వైరల్ అవుతన్నాయి.

Prabhas: 'ప్రభాస్.. ఎన్టీఆర్ స్నేహం గురించి చెప్పేందుకు ఆరోజు జరిగిన సంఘటన చాలు'.. డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్..
Prabhas Ntr
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 17, 2022 | 8:10 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన బిల్లా సినిమా రీ రిలీజ్ కు రెడీ అవుతోంది. అనుష్క నాయికగా, కృష్ణంరాజు ముఖ్య పాత్రలో నటించారు. గోపీకృష్ణా మూవీస్ పతాకంపై దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించారు. ఈ స్టైలిష్ యాక్షన్ మూవీ ఈ నెల 23న 4కె వెర్షన్ లో రీ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంగీత దర్శకుడు మణిశర్మ, నిర్మాత నరేంద్ర, కృష్ణంరాజు కుమార్తె ప్రసీధ, గీత రచయిత రామజోగయ్య శాస్త్రి, నటులు అలీ, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మెహర్ రమేష్ మాట్లాడుతూ.. డార్లింగ్.. తారక్ మధ్య ఉన్న స్నేహం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. వీరు ఎంత బెస్టో తాజాగా ఆయన విత్ సీన్‌ తో చెప్పారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు నెట్టింట తెగ వైరల్ అవుతన్నాయి.

బిల్లా సినిమాలో ఎయిర్ పోర్ట్ సీన్ షూట్ చేస్తున్న క్రమంలో.. ఓ వ్యక్తి కెమెరా వైపుగా నడుచుకుంటూ వచ్చారని.. ఎవరాని చూస్తే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని మెహర్ అన్నారు. ఏంటి ఇక్కడ అని అడిగితే.. షూటింగ్ చూసేందుకు వచ్చా అని తారక్ చెప్పారన్నారు. అంతేకాదు షూటింగ్‌ తరువాత ప్రభాస్ చేసిన వంటను తిన్నారన్నారు. ఇక తను కూడా వంట చేసి.. మా అందరికీ వడ్డించారన్నారు. ఇలా వీరిద్దరూ ఆ రోజు చాలా ఎంజాయ్ చేశారన్నారు డైరెక్టర్ మెహర్ రమేష్.

అలాగే బిల్లా సినిమాకు కృష్ణంరాజు అనుకున్నదానికంటే ఎక్కువ సపోర్ట్ చేశారని అన్నారు. రెండు హెలికాప్టర్ లు అడిగితే నాలుగు తెప్పిద్దాం అనేవారు. అలాగే కొన్ని యాక్షన్ సీన్స్ కోసం కార్లు కొన్నాం. కార్లను స్మాష్ చేశాం. ఈ చిత్రంలో కృష్ణంరాజు గారు నటించాలనే ఆలోచన ప్రభాస్ దే. పెదనాన్న నేనూ కలిసి నటించాలనేది ఫ్యాన్స్ కోరిక డార్లింగ్ అని అన్నాడు. అలా ఆయనతో క్యారెక్టర్ చేయించాం అంటూ చెప్పుకొచ్చారు డైరెక్టర్ మెహర్ రమేష్.

ఇవి కూడా చదవండి