Karthikeya 3: అయోధ్య నేపథ్యంలో కార్తికేయ 3.. ఎప్పుడూ చూడని.. వినని ప్రాచీన సాంస్కృతిక చరిత్ర..
డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా నార్త్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్ లోనూ ఈ సినిమా సత్తా చాటుకుంది. అయితే కార్తికేయ 2 కాకుండా.. సిక్వెల్ పై ఉంటుందనే హింట్ ఇవ్వడంతో.. ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన కార్తికేయ 2 సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిన విషయమే. తెలుగులోనే కాకుండా హిందీలోనూ ఈ మూవీకి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా భారీగానే కలెక్షన్స్ రాబట్టింది. డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా నార్త్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్ లోనూ ఈ సినిమా సత్తా చాటుకుంది. అయితే కార్తికేయ 2 కాకుండా.. సిక్వెల్ పై ఉంటుందనే హింట్ ఇవ్వడంతో.. ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. కార్తికేయ 3 ఎలా ఉంటుందంటూ అందరి దృష్టి ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న నిఖిల్ ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. గతంలో తనను అందరు ఎక్కడికి వెళ్లినా కార్తికేయ 2 సినిమా ఎప్పుడు వస్తుందని అడిగేవారని.. ఇప్పుడు కార్తికేయ 3 గురించి అడుగుతున్నారని చెప్పాడు.
ఈ సినిమా సీక్వెల్ చేసేవరకు తనను వదిలేలా లేరని.. ముఖ్యంగా ఈ మూవీ సీక్వెల్ తీయకపోతే మా అమ్మగారు వదలరంటూ చెప్పుకొచ్చాడు. అలాగే కార్తికేయ 3 మరొక అద్భుతమైన రహస్యం అని.. ఇది మిమ్మల్ని ఆశ్చర్యపరిచే, దిగ్భ్రాంతికి గురి చేస్తుందని ఎవరు చూడని, వినని ప్రాచీన సాంస్కృతిక చరిత్ర అని తెలిపారు నిఖిల్. ఈ క్రమంలోనే కార్తికేయ 3 పై బజ్ ఏర్పడింది. ఈ మూవీ స్టోరీ విషయంపై అనేక రకాల ఊహాగానాలైతే వినిపిస్తున్నాయి.
అయితే తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నేపథ్యంలో కార్తికేయ కథ కొనసాగితే ద్వారక నేపథ్యంలో కార్తికేయ 2 కథ కొనసాగింది. ఇక కార్తికేయ 3 కథ అంతా కూడా అయోధ్య నేపథ్యంలో ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. అంటే ఈసారి కథ శ్రీరాముడికి సంబంధించిన రహస్యాలతో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ రావాల్సి ఉంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.