AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రుతీహాసన్​ బాటలో మరో స్టార్​ హీరోయిన్.. పవన్ కళ్యాణ్ సినిమాపైనే యంగ్ బ్యూటీ ఆశలన్నీ!

ఎంతమంది స్టార్ హీరోలతో నటించినా, ఎంతగా కష్టపడి స్టెప్పులు వేసినా ఒక్క సరైన సక్సెస్ మాత్రం ఆమె దరిచేరడం లేదు. దీంతో సోషల్ మీడియాలో ఆమెపై రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె ఒక మెగా నిర్ణయం తీసుకుంది. టాలీవుడ్‌లో తన భవిష్యత్తును తేల్చే ఆ పవర్ ఫుల్ ప్రాజెక్టుపైనే ఇప్పుడు తన ఆశలన్నీ పెట్టుకుంది.

శ్రుతీహాసన్​ బాటలో మరో స్టార్​ హీరోయిన్.. పవన్ కళ్యాణ్ సినిమాపైనే యంగ్ బ్యూటీ ఆశలన్నీ!
Shruthi Haasan
Nikhil
|

Updated on: Feb 06, 2026 | 10:32 AM

Share

ఆమె అడుగు పెడితే థియేటర్లో డ్యాన్సుల జాతర మొదలవుతుంది. తన ఎనర్జీతో, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారు గుండెల్లో సెన్సేషన్ సృష్టించిన ఆ బ్యూటీ.. తక్కువ కాలంలోనే టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా ఎదిగింది. ఒకేసారి అరడజనుకు పైగా సినిమాలు చేస్తూ బిజీయెస్ట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అయితే దురదృష్టవశాత్తూ ఆమె నటిస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ఎంతమంది స్టార్ హీరోలతో నటించినా, ఎంతగా కష్టపడి స్టెప్పులు వేసినా ఒక్క సరైన సక్సెస్ మాత్రం ఆమె దరిచేరడం లేదు. దీంతో సోషల్ మీడియాలో ఆమెపై రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె ఒక మెగా నిర్ణయం తీసుకుంది. టాలీవుడ్‌లో తన భవిష్యత్తును తేల్చే ఆ పవర్ ఫుల్ ప్రాజెక్టుపైనే ఇప్పుడు తన ఆశలన్నీ పెట్టుకుంది. గతంలో ఒక స్టార్ హీరోయిన్ కూడా ఇలాగే వరుస ప్లాపులతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ హీరోనే ఆమెకు పునర్జన్మ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుందా? ఇంతకీ ఆ యంగ్ బ్యూటీ ఎవరు?

అయోమయంలో యంగ్​ బ్యూటీ..

టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం ఒక క్లిష్టమైన దశలో ఉంది. భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ టాలీవుడ్‌లో మాత్రం ఆమె కెరీర్ అయోమయంలో పడింది. ఇప్పటి వరకు అరడజనుకు పైగా సినిమాల్లో నటించినా శ్రీలీలకు ఒక్క సరైన బ్లాక్ బస్టర్ హిట్ పడలేదు. రీసెంట్‌గా రవితేజతో కలిసి చేసిన ‘మాస్ జాతర’ సినిమా కూడా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో ఈమె టాలీవుడ్ కెరీర్ ప్రమాదంలో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెకు పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఒక ఆఖరి ఆశగా కనిపిస్తోంది.

శ్రుతీ హాసన్ బాటలో..

శ్రీలీల పరిస్థితిని చూస్తుంటే గతంలో శ్రుతీ హాసన్ ఎదుర్కొన్న ఇబ్బందులు గుర్తుకొస్తున్నాయి. శ్రుతీ హాసన్ కూడా కెరీర్ మొదట్లో వరుస ప్లాపులతో ‘ఐరన్ లెగ్’ అనే విమర్శలను ఎదుర్కొన్నారు. సరిగ్గా అదే సమయంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమాలో ఆమెకు అవకాశం దక్కింది. ఆ సినిమా సాధించిన ఘనవిజయం శ్రుతి కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. అప్పటి నుంచి ఆమె టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా దూసుకుపోయారు. ఇప్పుడు అదే దర్శకుడు హరీష్ శంకర్, అదే హీరో పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కూడా శ్రుతీ హాసన్ లాగే తన కెరీర్‌ను మలుపు తిప్పుతుందని శ్రీలీల గట్టిగా నమ్ముతోంది.

Sreeleela & Shruthi Haasan

Sreeleela & Shruthi Haasan

ఉస్తాద్ పై భారీ అంచనాలు..

మార్చి 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమాలో శ్రీలీల నటనతో పాటు ఆమె డ్యాన్సులు కూడా హైలైట్ గా ఉండబోతున్నాయని సమాచారం. పవన్ కళ్యాణ్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో పక్కన సక్సెస్ అందుకుంటే శ్రీలీలకు టాలీవుడ్‌లో తిరుగుండదు. తమిళంలో ధనుష్ లాంటి హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్నా, టాలీవుడ్‌లో నిలబడాలంటే మాత్రం ‘ఉస్తాద్’ కచ్చితంగా హిట్టు కొట్టాల్సిందే.

సక్సెస్ సెంటిమెంట్..

హరీష్ శంకర్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు చాలా ఎనర్జిటిక్ గా ఉంటాయి. పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్, శ్రీలీల డ్యాన్సింగ్ స్కిల్స్ తోడైతే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురవడం ఖాయం. శ్రీలీల ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో కూడా బిజీగా ఉన్నప్పటికీ, తెలుగు ప్రేక్షకులు ఇచ్చే ఆదరణ ఆమెకు చాలా ముఖ్యం. అందుకే ఈ సినిమా ప్రమోషన్లలో కూడా ఆమె ఎంతో ఉత్సాహంగా పాల్గొంటోంది. మార్చి 26న పడే రిజల్ట్ శ్రీలీల టాలీవుడ్ లైఫ్ ను డిసైడ్ చేయబోతోంది. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న శ్రీలీలకు పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూపంలో ఒక పెద్ద వరం దక్కింది. గబ్బర్ సింగ్ సెంటిమెంట్ రిపీట్ అయి ఆమె మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందో లేదో చూడాలి.

Follow Us