AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రక్తార్పణమే నైవేద్యం.. ఊరంతా పూనకాలతో ఊగిపోయే సమ్మక్క తమ్ముడి జాతర గురించి తెలుసా..?

ఆ జాతరలో రక్తార్పణమే అతి కీలకం.. గుట్ట పై నుండి బాల కుమారస్వామి ఆగమనం సందర్భంగా ఊరంతా పూనకాలతో ఊగిపోతారు.. ఇంటికో కోడి లేదంటే మేక తల తెగాల్సిందే.. అక్కడి గిరిజన ఆచార సాంప్రదాయాలకు ప్రతిరూపంగా జరిగే బాలా కుమారస్వామి జాతర విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Telangana: రక్తార్పణమే నైవేద్యం.. ఊరంతా పూనకాలతో ఊగిపోయే సమ్మక్క తమ్ముడి జాతర గురించి తెలుసా..?
Bala Kumara Swamy Jatara
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Feb 06, 2026 | 10:32 AM

Share

ప్రకృతినే దైవంగా పూజించే గిరిజన ఆచార సాంప్రదాయాలలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా జాతరలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ములుగు జిల్లాలోని అంకన్నగూడెం గ్రామంలో జరిగే బాల కుమార స్వామి జాతర మారుమూల గిరిజనుల ఆచార సంప్రదాయాలకు నిలువుటద్దం పడుతుంది. మేడారం సమ్మక్క సారక్క జాతర తరహాలోనే ఈ గ్రామంలో కూడా ప్రతి రెండేళ్లకు ఒకసారి జాతర నిర్వహిస్తారు. సమ్మక్క సారక్క జాతర తిరుగువారం రోజున ఇక్కడి గిరిజనులు బాలకుమారస్వామి జాతర నిర్వహిస్తారు. సమ్మక్కకు స్వయాన తమ్మునిగా భావించి బాల కుమారస్వామికి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జాతర నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతుంది.

అంకన్నగూడెం గ్రామ సమీపంలోని గుట్టపై నుండి బాల కుమారస్వామిని గిరిజన పూజారులు ఓ ముంత రూపంలో గుడికి తీసుకొస్తారు. ఈ క్రమంలో ఊరంతా పూనకాలతో ఊగిపోతారు. ప్రతి ఇంటికి ఒకరు కోడిని లేదంటే మేకను బలిచ్చి రక్తార్పణం చేస్తారు. దేవున్ని గుట్ట పై నుండి గుడికి తీసుకొచ్చే సమయంలో చాలామంది తడి బట్టలతో కింద పడుకొని పూజరాలతో తొక్కించుకుంటారు. మేడారం జాతరకు ఉన్నంత విశిష్టత బాల కుమార్ స్వామికి ఉందని ఇక్కడి ఆదివాసీలు చెబుతున్నారు. తమ ఆచార సాంప్రదాయాల ప్రకారం రెండేళ్లకోసారి గుట్టపై నుండి స్వామివారిని కిందకు దించి పూజలు నిర్వహించిన అనంతరం తిరిగి మళ్లీ వన ప్రవేశం చేస్తామని చెప్తున్నారు.

వీడియో చూడండి..

జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
కుప్పకూలిన "సునామీ స్వింగ్", ఒకరు మృతి, 13మందికి సీరియస్!
కుప్పకూలిన
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
రోజూ ఓ గ్లాస్‌ రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదా?
రోజూ ఓ గ్లాస్‌ రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదా?