Manchu Manoj: గుడ్ న్యూస్ చెప్పిన మంచుమనోజ్.. పండంటి పాపకు జన్మనిచ్చిన మౌనిక.. ముద్దుపేరు ఏంటంటే..

మంచు మనోజ్ దంపతులు తల్లిదండ్రులయ్యారు. శనివారం ఉదయం మంచు మౌనిక పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మంచు లక్ష్మి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపారు. "మనోజ్, మౌనిక మరోసారి తల్లిదండ్రులయ్యారు. మా ఇంట్లోకి చిన్న దేవత వచ్చింది. మనోజ్, మౌనిక ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమ పాపను ఈ లోకంలోకి స్వాగతించారు. అన్న అయినందుకు ధైరవ్ ఆనందానికి అవధులు లేవు.

Manchu Manoj: గుడ్ న్యూస్ చెప్పిన మంచుమనోజ్.. పండంటి పాపకు జన్మనిచ్చిన మౌనిక.. ముద్దుపేరు ఏంటంటే..
Manchu Manoj, Mounika
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 13, 2024 | 12:38 PM

మంచు మనోజ్ దంపతులు తల్లిదండ్రులయ్యారు. శనివారం ఉదయం మంచు మౌనిక పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మంచు లక్ష్మి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపారు. “మనోజ్, మౌనిక మరోసారి తల్లిదండ్రులయ్యారు. మా ఇంట్లోకి చిన్న దేవత వచ్చింది. మనోజ్, మౌనిక ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమ పాపను ఈ లోకంలోకి స్వాగతించారు. అన్న అయినందుకు ధైరవ్ ఆనందానికి అవధులు లేవు. ఆమెను మేమంతా ముద్దుగా ‘MM పులి’ అని పిలుస్తాము. ఈ సంపూర్ణయ కుటుంబానికి ఆ శివుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.. మీరందరూ ప్రేమతో వారిని ఆశీర్వదించండి” అంటూ ట్వీట్ చేసింది. దీంతో మనోజ్, మౌనిక దంపతులకు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మంచు లక్ష్మి ట్వీట్ ను మనోజ్ రీట్వీట్ చేశాడు.

మంచు మనోజ్, మౌనిక కొన్నాళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటికే మౌనికకు ధైరవ్ అనే బాబు ఉన్నాడు. ఇక కొన్ని నెలల క్రితం మౌనిక ప్రెగ్నెంట్ అంటూ శుభవార్త పంచుకున్నారు మనోజ్. అలాగే మౌనిక బేబీ షవర్, బేబీ బంప్ ఫోటోస్ నెట్టింట తెగ వైరలయ్యాయి. ఇక ఇప్పుడు పాప జన్మించిందంటూ మరోసారి అభిమానులతో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.