Manchu Lakshmi: మిస్ యూ అమ్మా! తల్లి సమాధి వద్ద కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మి.. వీడియో వైరల్
మంచువారమ్మాయి మంచు లక్ష్మి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. తన మకాన్ని కూడా హైదరాబాద్ నుంచి ముంబైకి మార్చేసింది. అప్పుడప్పుడు మాత్రమే ఇక్కడకు వచ్చి వెళుతోంది. తాజాగా ఆమె నెల్లూరులో పర్యటించింది. అక్కడ తన తల్లి సమాధి దగ్గర నివాళులు అర్పించింది.

ప్రస్తుతం ముంబైలోనే ఉంటోన్న మంచు లక్ష్మి మంగళవారం (జులై 22) నెల్లూరులో పర్యటించింది. పట్టణంలోని ఓ షాప్ ఓపెనింగ్ కు హాజరైంది. ఈ సందర్భంగా అభిమానులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. షాప్ ఓపెనింగ్ తర్వాత అదే జిల్లాలోని నాయుడు పేటకు వెళ్లిపోయింది మంచు లక్ష్మి. అక్కడ తన తల్లి విద్యాదేవి సమాధిని సందర్శించింది. ఆమెకు ఘనంగా నివాళి అర్పించింది. అమ్మతో తనకున్న జ్ఞాపకాలు, అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ కాస్త ఎమోషనల్ అయ్యింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు,వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. నటుడు మోహన్ బాబు మొదట విద్యాదేవిని పెళ్లి చేసుకున్నారు. ఆమెకు పుట్టిన పిల్లలే మంచు విష్ణు, లక్ష్మి. అయితే అనారోగ్యంతో విద్యాదేవి చనిపోవడంతో ఆమె సోదరి నిర్మలా దేవిని మోహన్ బాబు రెండో వివాహం చేసుకున్నారు. ఆమెకు పుట్టిన బిడ్డే మంచు మనోజ్. అయితే మొన్నటివరకు ఒకే కడుపున పుట్టిన బిడ్డల్లా ఎంతో అన్యోన్యంగా ఉంటూ వచ్చారు విష్ణు, మనోజ్, లక్ష్మి. వీరు వేర్వేరు తల్లుల బిడ్డలన్న సంగతి కూడా చాలా మందికి తెలియదు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ గత కొన్నాళ్లుగా మంచు ఫ్యామిలీలో గొడవలు చోటుచేసుకుంటున్నాయి. అన్నదమ్ములైన మంచు విష్ణు, మనోజ్ ల మధ్య విభేదాలు తలెత్తాయి. ఒకరిపై ఒకరు పోలీస్ కేసులు పెట్టుకునే దాకా వెళ్లారు.
కాగా గత కొన్నాళ్లు ఎవరి వ్యక్తిగత పనుల్లో వారు బిజీగా ఉంటున్నారు విష్ణు, మనోజ్. సినిమాల్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. మనోజ్ నటించిన భైరవం కొన్ని రోజుల క్రితమే ప్రేక్షకుల ముందుకు రాగా, కన్నప్ప సినిమాతో ఆడియెన్స్ ను పలకరించాడు మంచు విష్ణు.
ఇక మంచు లక్ష్మి మాత్రం ప్రస్తుతానికి కొత్త సినిమాలేవీ చేయడం లేదు.అయితే హిందీలో ‘ద ట్రైటర్స్’ అనే షోలో పాల్గొంది. ఇది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే మంచు లక్ష్మి నటించిన దక్ష.. ద డెడ్లీ కాన్‌స్పిరసి అనే సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. ఇందులో పోలీస్ పాత్రలో కనిపించనుంది మంచు వారమ్మాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.
నాయుడు పేటలోని తల్లి సమాధి దగ్గర మంచు లక్ష్మి.. వీడియో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.







