Hari Hara Veera Mallu: ఓజీ, ఉస్తాద్ తర్వాత సినిమాలు చేస్తారా? టీవీ9తో పవన్ కల్యాణ్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ.. వీడియో
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సుమారు మూడేళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించనున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం హరి హర వీరమల్లు. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ జులై 24న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
మెగా అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తోన్న చిత్రం హరి హర వీరమల్లు. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక రిలీజవుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న హరి హర వీరమల్లు జులై 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అందుకు తగ్గట్టే ఇప్పటివరకు రిలీజైన సినిమా పోస్టర్లు, గ్లింప్స్, ట్రైలర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. జాగర్లమూడి క్రిష్, జ్యోతి కృష్ణ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ హిస్టారికల్ మూవీలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఔరంగ జేబు పాత్రలో కనిపించనున్నాడు. నోరా ఫతేహి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూర్చారు. రిలీజ్ కు రెండు రోజులు మాత్రమే ఉండడంతో సినిమా ప్రమోషన్లలో స్పీడ్ పెంచారు మేకర్స్. పవన్ కల్యాణ్ స్వయంగా ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూలకు హాజరవుతుండడం విశేషం. ఈ నేపథ్యంలో టీవీ9తో సరదాగా ముచ్చటించారు పవర్ స్టార్. హరి హర వీరమల్లు సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే సినిమాల్లో కొనసాగడంపైనా ఫుల్ క్లారిటీ ఇచ్చారు పవన్. మరి ఆ ముచ్చట్లేంటో పై వీడియోలో చూడండి..
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
