Mamata Mohandas: ఆ పుకార్లను నమ్మకండి.. మరోసారి ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన యమదొంగ హీరోయిన్..
హీరోయిన్ మమతా మోహన్ దాస్ సుధీర్ఘ కాలంపాటు క్యాన్సర్ తో పోరాడి ప్రాణాలను దక్కించుకుంది. తను చికిత్స తీసుకుంటున్న సమయంలోని ఫోటోస్ షేర్ చేస్తూ ప్రజలకు అవగాహన కూడా కల్పించింది. ఇక క్యాన్సర్ ను జయించిన తర్వాత చాలా కాలం ఇండస్ట్రీకి దూరంగా
సినీ పరిశ్రమలో చాలా మంది నటీనటులు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారు. కొందరు దీనిని జయించి తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుండగా.. మరికొందరు మాత్రం పోరాడి ఓడిపోతున్నారు. బాలీవుడ్ బ్యూటీ మనీషా కొయిరాలా, సోనాలి బింద్రె, టాలీవుడ్ హీరోయిన్ మమతా మోహన్ దాస్ వంటి సెలబ్రెటీలు క్యాన్సర్ మహమ్మారిని జయించి ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో మన తెలుగు హీరోయిన్ మమతా మోహన్ దాస్ సుధీర్ఘ కాలంపాటు క్యాన్సర్ తో పోరాడి ప్రాణాలను దక్కించుకుంది. తను చికిత్స తీసుకుంటున్న సమయంలోని ఫోటోస్ షేర్ చేస్తూ ప్రజలకు అవగాహన కూడా కల్పించింది. ఇక క్యాన్సర్ ను జయించిన తర్వాత చాలా కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇప్పడిప్పుడే సినిమాల్లోకి తిరిగి వస్తున్నారు. అయితే కొద్దిరోజులుగా ఈ హీరోయిన్ గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మమతా మరోసారి క్యాన్సర్ బారిన పడిందంటూ ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్స్ పై స్పందించింది మమతా. తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.
నా ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలు చూసి నా అభిమానులు.. సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. వారు నాకు డీఎంఎస్, మెయిల్ స్ చేస్తున్నారు. ఇటీవల నన్ను ఇంటర్వ్యూ చేశామని చెప్పుకుంటున్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఈ వార్తలను ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నాను. నేను మళ్లీ క్యాన్సర్ బారిన పడలేదు. నా ఆరోగ్యం గురించి నేను చెప్పేవరకు ఎలాంటి వార్తలను నమ్మకండి. మీరు విన్నవి.. లేదా చదివినవి నమ్మకండి. మీ నాటకాన్ని మీ వద్దే కాపాడుకోండి.. నేను క్యాన్సర్ కు లొంగిపోవడం లేదు అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చింది.
పృథ్వీరాజ్ నటించిన డిజో జోస్ తెరకెక్కించిన జన్ గన్ మన చిత్రంలో చివరిసారిగా కనిపించింది మమతా. 2009లో ఆమె హాడ్కిన్స్ లింఫోమాతో బాధపడుతున్నట్లు తెలిపారు. అప్పటినుంచి చికిత్స తీసుకున్న ఆమె 2013లో క్యాన్సర్ ను జయించింది. ప్రస్తుతం ఆమె వయసు 38 సంవత్సరాలు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.