Hit 2 Trailer: హిట్ 2 ట్రైలర్ వచ్చేసింది.. మరోసారి అదరగొట్టిన అడివి శేష్.. వెన్నులో వణుకు పుట్టించే సీన్లతో..
న్యాచురల్ స్టార్ నాని సమ్పరణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్‌నేని సినిమాను నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన టీజర్ సినిమాపై మరింత క్యూరియాసిటిని పెంచేసింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
వరుస విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ.. అందరినీ ఆకట్టుకుంటూ ..తనదైన క్రేజ్, ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో అడివి శేష్. ఈయన హీరోగా డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘హిట్ 2’. హిట్ ది ఫస్ట్ కేస్ సినిమాతో మెప్పించిన శైలేష్ హిట్ 2 ది సెకండ్ కేస్‌తో మరోసారి పర్‌ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మీనాక్షి చౌదరి ఇందులో అడివి శేష్ జోడీగా నటించింది. న్యాచురల్ స్టార్ నాని సమ్పరణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్‌నేని సినిమాను నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన టీజర్ సినిమాపై మరింత క్యూరియాసిటిని పెంచేసింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
తాజాగా విడుదలైన ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ట్రైలర్ మరింత భయంకరమైన కేసును ఎదుర్కొన్న కూల్ పోలీసు కృష్ణ దేవ్ ప్రయాణంలో ఒక స్నీక్ పీక్ ఇస్తుంది. ట్రైలర్‌లో మొత్తం నగరాన్ని కదిలించిన భయంకరమైన హత్య కేసును అడివి శేష్ ఎలా పరిష్కరించారనేది హిట్ 2 మూవీ. ఇందులో హోమీసైడ్ ఇంటర్‌వెన్షన్ టీమ్‌లో కూల్ కాప్ అయిన కె.డి అనే పోలీస్ ఆఫీసర్‌గా అడివి శేష్ కనిపించబోతున్నారు. ఇంకా రావు రమేష్, శ్రీనాథ్ మాగంటి, కోమలి ప్రసాద్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటి కే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా హిట్ 2 రిలీజ్ అవుతుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.