Kantara: తగ్గేదే లే.. కాంతార ప్రభంజనం.. ఏకంగా ఆ రికార్డ్ బ్రేక్ చేసి మరీ సెన్సెషన్..

ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై భారీగా కలెక్షన్స్ రాబడుతుంది. తక్కువ బడ్జెట్‏తో రూపొందించిన ఈ మూవీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నయా రికార్డ్ క్రియేట్ చేసింది. విడుదలై 50రోజులు దాటిన థియేటర్లలో సక్సెస్‍ఫుల్ గా సత్తా చాటుతుంది.

Kantara: తగ్గేదే లే.. కాంతార ప్రభంజనం.. ఏకంగా ఆ రికార్డ్ బ్రేక్ చేసి మరీ సెన్సెషన్..
Kantara Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 23, 2022 | 7:37 AM

కన్నడ చిత్రం కాంతార బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. కేవలం కన్నడలోనే కాకుండా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో సక్సెస్‏ఫుల్‏గా దూసుకుపోతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై భారీగా కలెక్షన్స్ రాబడుతుంది. తక్కువ బడ్జెట్‏తో రూపొందించిన ఈ మూవీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నయా రికార్డ్ క్రియేట్ చేసింది. విడుదలై 50రోజులు దాటిన థియేటర్లలో సక్సెస్‍ఫుల్ గా సత్తా చాటుతుంది. తాజా గా ఈ సినిమా కేజీఎఫ్ 2 రికార్డ్ బ్రేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ. 400కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కన్నడలో ‘కాంతారా’ సెప్టెంబర్ 30న విడుదలైంది. తర్వాత ఇతర భాషల్లో కూడా ప్రేక్షకుల నుంచి డిమాండ్ రావడంతో డబ్ చేసి విడుదల చేశారు. ఈ చిత్రానికి అన్ని భాషల్లో మంచి ప్రశంసలు అందుకుంటుటంది.

కన్నడలో రూ.168.50 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత ఆంధ్రా, తెలంగాణల్లో తెలుగు వెర్షన్ నుంచి రూ.60 కోట్లు రాబట్టింది. తమిళనాడులో రూ.12.70 కోట్లు, కేరళలో రూ.19.20 కోట్లు వసూలు చేసింది. హిందీ వెర్షన్‌కి రూ. 96 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. విదేశీ బాక్సాఫీస్ వద్ద రూ.44.50 కోట్లు వసూలు చేసింది. కన్నడ సినిమా ఈ ఘనత సాధించడం నిజంగా అభినందనీయం. ఇప్పటికీ చాలా చోట్ల మంచి ప్రదర్శన కనబరుస్తోంది.ఈ చిత్రంలో రిషబ్ శెట్టి నటన, దర్శకత్వం అభిమానుల నుంచి చాలా ప్రశంసలు అందుకుంది.ఈ సినిమాలో సప్తమి గౌడ, కిషోర్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, మానసి సుధీర్ కీలకపాత్రలలో నటించారు.

ఇవి కూడా చదవండి

ఇక త్వరలోనే ఈ సినిమా సిక్వెల్ రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే విషయం నెట్టింట వైరలవుతుండగా.. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్ ప్రీక్వెల్ గురించి ఇంకా ఏమీ ఆలోచించడం లేదని.. అంతే కాకుండా రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకున్న తరువాతే దాని గురించి ఆలోచిస్తానని చెప్పుకొచ్చాడు హీరో రిషబ్ శెట్టి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.