AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srikanth-Uha: విడాకుల పుకార్లను ఖండించిన శ్రీకాంత్.. వారిపై సైబర్ క్రైమ్‏కు ఫిర్యాదు చేస్తానంటూ..

హీరో శ్రీకాంత్, ఊహ విడాకులు తీసుకుంటున్నట్లుగా గత కొద్ది రోజులుగా నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తను, ఊహ విడాకులు తీసుకుంటున్నట్లుగా వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు

Srikanth-Uha: విడాకుల పుకార్లను ఖండించిన శ్రీకాంత్.. వారిపై సైబర్ క్రైమ్‏కు ఫిర్యాదు చేస్తానంటూ..
Srikanth
Rajitha Chanti
|

Updated on: Nov 22, 2022 | 2:24 PM

Share

తను, ఊహ విడాకులు తీసుకుంటున్నట్లుగా వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు హీరో శ్రీకాంత్. కొన్ని వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్‏లో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నాయని అన్నారు. ఎవరు పుట్టిస్తున్నారు ఇలాంటి నిరాధారమైన పనికిమాలిన వార్తలను…!? గతంలో నేను చనిపోయినట్లుగా ఒక పుకారు పుట్టించి నా కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేశారని.. . ఇప్పుడు తాజాగా మేము ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడాకులు తీసుకుంటున్నాం అంటూ ఒక న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హీరో శ్రీకాంత్, ఊహ విడాకులు తీసుకుంటున్నట్లుగా గత కొద్ది రోజులుగా నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.

“ఎవరు పుట్టిస్తున్నారు ఇలాంటి నిరాధారమైన పనికిమాలిన వార్తలను…!? గతంలో నేను చనిపోయినట్లుగా ఒక పుకారు పుట్టించి నా కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేశారని.. . ఇప్పుడు తాజాగా మేము ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడాకులు తీసుకుంటున్నాం అంటూ ఒక న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. కొన్ని వెబ్సైట్స్‏లో వచ్చిన ఈ అసత్య వార్తలను తన ఫ్రెండ్స్ ఊహకు ఫార్వర్డ్ చేయడంతో తను కంగారుపడుతూ ఆ పోస్టులను నాకు చూపించింది. ఇలాంటివి ఏమాత్రం నమ్మద్దు …ఆందోళన పడవద్దు … అని తనను ఓదార్చాను . అయితే ఏవో కొన్ని చిల్లర వెబ్సైట్స్, యూట్యూబ్ చానల్స్ వాళ్ళు చేసిన ఈ పని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో బంధుమిత్రులందరూ ఫోన్ చేసి అడుగుతుంటే వివరణ ఇచ్చుకోవడం పెద్ద న్యూసెన్స్‏గా అనిపిస్తుంది. ప్రస్తుతం నేనూ ఊహ నిన్న చెన్నై వచ్చి ఇక్కడి నుండి దైవ దర్శనానికి అరుణాచలం వెళ్తున్నాం.

ఇవి కూడా చదవండి

ఇలాంటి తరుణంలో ఈ పుకారు మా కుటుంబానికి చాలా చిరాకు తెప్పిస్తుంది. ఇది ఇంకా ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఉండటం కోసం ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నాను. నా మీదనే కాకుండా చాలామంది ప్రముఖుల మీద ఇలాంటి నిరాధారమైన పుకార్లు స్ప్రెడ్ చేస్తున్న వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ మీద సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను” అంటూ హీరో శ్రీకాంత్ ఆ లేఖలో పేర్కొన్నారు

Follow Us
EPFO క్లెయిమ్స్, పెన్షన్ సమస్యలు ఉన్నాయా? ఈ క్యాంప్‌కు వెళ్తే..
EPFO క్లెయిమ్స్, పెన్షన్ సమస్యలు ఉన్నాయా? ఈ క్యాంప్‌కు వెళ్తే..
సింగిల్ టేక్ ఆర్టిస్ట్ డైలాగ్‌పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
సింగిల్ టేక్ ఆర్టిస్ట్ డైలాగ్‌పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
స్థానిక సమస్యల బాధ్యత ఎంపీదా? మున్సిపాలిటీదా? చట్టం ఏం చెప్తోంది?
స్థానిక సమస్యల బాధ్యత ఎంపీదా? మున్సిపాలిటీదా? చట్టం ఏం చెప్తోంది?
ఎలుకలు, చుంచెలుక కాటుతో విసిగిపోయారా? ఇది ఒక్క చుక్కతో ఇంటి నుండి
ఎలుకలు, చుంచెలుక కాటుతో విసిగిపోయారా? ఇది ఒక్క చుక్కతో ఇంటి నుండి
గేమ్ షురూ.. అనిరుధ్‌కు కరెక్ట్ పోటీ అతడేనా..?
గేమ్ షురూ.. అనిరుధ్‌కు కరెక్ట్ పోటీ అతడేనా..?
నాగుపాము పడగవిప్పి.. నిటారుగా ఎందుకు నిలుచుంటుంది..?
నాగుపాము పడగవిప్పి.. నిటారుగా ఎందుకు నిలుచుంటుంది..?
స్టార్ హీరోకు చుక్కలు చూపించిన శ్రీదేవి..
స్టార్ హీరోకు చుక్కలు చూపించిన శ్రీదేవి..
ప్యారడైజ్ పై KTR కామెంట్స్..శంకరన్న పాత్ర గురించి ఏం చెప్పారంటే
ప్యారడైజ్ పై KTR కామెంట్స్..శంకరన్న పాత్ర గురించి ఏం చెప్పారంటే
ఓటీటీ ప్రియులకు అదిరిపోయే న్యూస్.. ఈ వారం రిలీజ్ అయ్యే మూవీస్ ఇవే
ఓటీటీ ప్రియులకు అదిరిపోయే న్యూస్.. ఈ వారం రిలీజ్ అయ్యే మూవీస్ ఇవే
ఆయన అంకితభావం మరువలేనిది.. అశోక్ సింఘాల్‌ బర్త్‌డే సందర్భంగా మోదీ
ఆయన అంకితభావం మరువలేనిది.. అశోక్ సింఘాల్‌ బర్త్‌డే సందర్భంగా మోదీ