Hansika Motwani: పెళ్లికి ముందు అభిమానులకు షాకిచ్చిన హన్సిక.. ఇంతగా మారిపోయిందేంటీ..

పెళ్లికి రెండు రోజుల ముందుగానే మెహిందీ, సంగీత్ వంటి కార్యక్రమాలు ఓటీటీలోనూ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇటీవల తన ప్రియుడిని ఇన్ స్టా వేదికగా అభిమానులకు పరిచయం చేసింది హన్సిక.

Hansika Motwani: పెళ్లికి ముందు అభిమానులకు షాకిచ్చిన హన్సిక.. ఇంతగా మారిపోయిందేంటీ..
Hansika
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 23, 2022 | 7:11 AM

టాలీవుడ్ హీరోయిన్ హాన్సిక మోత్వానీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. తన బిజినెస్ పార్టనర్ సోహాల్ కతూరియాతో డిసెంబర్ 4న ఏడడుగులు వేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. రాజస్థాన్ లోని జైపూర్ లో ఓ ప్రాచీన ప్యాలెస్ లో వీరి వివాహం జరగునుంది. పెళ్లికి రెండు రోజుల ముందుగానే మెహిందీ, సంగీత్ వంటి కార్యక్రమాలు ఓటీటీలోనూ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇటీవల తన ప్రియుడిని ఇన్ స్టా వేదికగా అభిమానులకు పరిచయం చేసింది హన్సిక. తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

పెళ్లికి ముందు వధువులా ముస్తాబై ఎరుపు చీరలో కనిపించింది. వివాహ వేడుకలో భాగంగా జరిగే మాతా కీ చౌకీ కార్యక్రమం ఇవాళ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంతో ఈరోజు వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం కాబోయే వధువు ఎరుపు రంగు చీర ధరించి కారులో పూజకు వెళ్తుండగా కెమెరాకు చిక్కింది. ముంబై జరుగుతున్న ఈ వేడుకలో హాన్సిక అచ్చం నూతన వధువులా కనిపించింది. మాతా కీ చౌకీ తర్వాత డిసెంబర్ 2న సూఫీ నైట్, డిసెంబర్ 3 న మెహందీ, సంగీత వేడుకలు జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. సోమవారం పూర్తిగా న్యూలుక్‏లో కనిపించి అభిమానులకు షాకిచ్చింది ఈ దేశముదురు బ్యూటీ. నయా హెయిర్ స్టైల్ తో ముంబైలోని ఓ ప్రముఖ సెలూన్ నుంచి బయటకు వస్తున్న హాన్సిక గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.