Honey Rose: అక్కడికి వెళ్తే తిరిగి రావాలనిపించదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన హనీరోజ్

మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ గతంలో తెలుగులో సినిమాలు చేసింది. కానీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేదు. ఆతర్వాత మలయాళం పైనే ఎక్కువ దృష్టి పెట్టింది. అక్కడ వరుసగా సినిమాలు చేసి క్రేజ్ తెచ్చుకుంది.

Honey Rose: అక్కడికి వెళ్తే తిరిగి రావాలనిపించదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన హనీరోజ్
Honeyrose
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 12, 2024 | 7:36 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది హాట్ బ్యూటీ హనీరోజ్. మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ గతంలో తెలుగులో సినిమాలు చేసింది. కానీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేదు. ఆతర్వాత మలయాళం పైనే ఎక్కువ దృష్టి పెట్టింది. అక్కడ వరుసగా సినిమాలు చేసి క్రేజ్ తెచ్చుకుంది. మలయాళంలో హనీ రోజ్ చాలా పాపులర్ నటి. వీరసింహారెడ్డి సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ మరో సినిమా అనౌన్స్ చేయలేదు.  చాలా రోజుల తర్వాత హనీ రాచెల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మలయాళంతో పాటు పలు భాషల్లోనూ విడుదల కానుంది.

ఇది కూడా చదవండి : Suriya: సూర్య ఫస్ట్ క్రష్ ఆ హీరోయినా..! జ్యోతిక మాత్రం కాదు

సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది ఈ బ్యూటీ. హనీ రోజ్ చేసిన అన్ని ఫోటోషూట్‌లు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. అంతే కాదు ఈ అమ్మడు సినిమాలతో కంటే షాపింగ్ మాల్స్ ఓపినింగ్స్ తోనే కాలం గడిపేస్తోంది. తాజాగా ప్రారంభోత్సవాలకు వెళ్లడంపై హనీ చేసిన కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వివాహాలకు హాజరవడం కంటే ప్రారంభోత్సవాలకు హాజరయ్యేందుకు ఆసక్తి చూపుతానని హనీ చెప్పింది. దాంతో అందరూ అవాక్ అవుతున్నారు. ఫంక్షన్‌కి వెళ్లేటప్పుడు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో తెలియని అయోమయం తరచుగా ఉంటుంది. ఫంక్షన్ కోసం డ్రెస్ ముందుగానే డిజైన్ చేయించుకోవాలి. ఏదైనా వేడుకలు వస్తే ముందుగా ప్లాన్ చేసుకుంటారు. కానీ షాపింగ్ మాల్ ఓపినింగ్స్ కు అలా కాదు కారులో కూర్చొని ప్రారంభోత్సవం చేయబోయే షాపు వివరాలు తెలుసుకుంటా అని చెప్పుకొచ్చింది.

ఇది కూడా చదవండి : దేశం విడిచి పారిపోయిన నటి.. డబ్బులు లేక బిచ్చగత్తెలా బ్రతుకుతున్నా అంటూ..

ఓపెనింగ్స్ నేను చాలా ఎంజాయ్  చేస్తా.. మన కోసం ఎదురుచూసే జనాలను చూడటం , వారి ప్రేమను పొందడం నాకు చాలా ఇష్టం. మేము ప్రారంభించబోయే దుకాణం ఒక వ్యక్తి జీవితానికి సంబంధించినది. వెల్ కమ్ చెబుతూ ఆయన ప్రారంభించే సంస్థకు మమ్మల్ని ఆహ్వానించడం ఓ విశేషం. నాకు ఆ వైబ్ అంటే చాలా ఇష్టం. కానీ అందరితో కలిసి పెళ్లికి వెళ్లడం నాకు చాలా కష్టం. అవార్డు షోకి వెళ్లడానికి కూడా ఇబ్బంది పడుతున్నాను. అయితే ప్రారంభోత్సవానికి వెళ్లిన తర్వాత అక్కడి నుంచి తిరిగి రావాలని నాకు అనిపించదు అని చెప్పుకొచ్చింది హనీ రోజ్. ఇప్పుడు ఈ అమ్మడి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Honey Rose (@honeyroseinsta)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!